విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది. 29.06.2022, బుధవారం కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో కృష్ణ డీసీసీ బ్యాంకు యొక్క కొత్త TCS సాఫ్ట్వేర్ ను అప్కోబ్ MD ఆర్. శ్రీనాధ రెడ్డి మరియు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్కోబ్ MD మాట్లాడుతూ డీసీసీ బ్యాంకులు ఈ కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించటానికంటే ముందు అప్కోబ్ లో ఒక సంవత్సరం పైగా ఉపయోగంలో ఉందని , దీని వల్ల సహకార బ్యాంకులు కూడా అన్ని రకాల ఆన్లైన్ సేవలను తమ ఖాతాదారులకు మరియు వినియోగదారులకు అందిచవచ్చునని, Gpay , Phonepe , మరియు BHIM UPI మొదలగు డిజిటల్ ప్రెమెంట్స్, నెట్ బ్యాంకింగ్ , మొబైల్ బ్యాంకింగ్ సేవలు మరియు ఎ.ఈ.పి.యస్(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం) కూడా ఒక నెల రోజులలో అందుబాటులోకి వస్తాయి అని, త్వరలో నే సహకార సంఘాలను కూడా కంప్యూటరేజషన్ చేస్తామని తద్వారా జిల్లా లో ప్రతి పల్లెటూరు లో ఒక మినీ బ్యాంకు ఉంటుందని తెలిపారు. అలాగే సహకార బ్యాంకు ఇపుడు రాష్ట్రములో 4వ స్థానం లో ఉందని, వినియోగదారులకు ఇలాంటి విశిష్టమైన సేవలు అందించి రాష్ట్రము లోనే కాకా దేశం లోనే మొదటి స్థానం లోకి కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివ్రుది దిశాగా తీసుకెళాలని చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ను కోరారు. ఈ సందర్భంగా కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వర రావు మాట్లాడుతూ Polaris వారి CBS నుండి TCS వారి B@NCS24 సాఫ్ట్వేర్ కి మారటం వల్ల ఒకపుడు RTGS మరియు NEFT సేవలలో జరిగిన ఆలస్యం ఇకమీదట ఉండదని అన్ని ఆన్లైన్ సేవలు వలన ఖాతాదారులకు ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతామని అప్కోబ్ ఎండీ శ్రీనాధ రెడ్డి సూచించినట్లుగా రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్కోబ్ జీఎం రామకృష్ణ , కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్లు యాన్.కే.యస్. ప్రకాశరావు, పి.సుజాత, బి.రాణి, సీఈఓ ఎ.శ్యామ్ మనోహర్, జీఎం బి.యల్.చంద్రశేఖర్, యన్. రంగబాబు, కృష్ణ కో-ఆపరేటివ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ R రాంబాబు TCS మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
– పందెంలో పాల్గొన్నా చట్టరీత్యా నేరమే – నిబంధనల అమలు చేసేందుకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు …