ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో వెండి తాపడానికి కేజిన్నర వెండి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడు లో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో సంకల్పించినటువంటి వెండి తాపడం పనులకు విశేషమైన స్పందన కలుగుతుంది. ఈ వెండి తాపడమునకు అమెరికా వాస్తవ్యులు కె విశ్వ దత్త కుమార్, కె శివ నాగ పద్మిని లు కేజిన్నర వెండిని వారి తల్లిదండ్రుల ద్వారా మందిర గౌరవాధ్యక్షులు  పి.గౌతమ్ రెడ్డి కి సమర్పించారు. దాత తల్లిదండ్రులు మాట్లాడుతూ మందిరంలో నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు చూసి ఎంతో ఆనందం కలిగింది, అందుచేతనే మందిరం వారు నిర్వహించిన ఏ కార్యక్రమానికైనా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అందులో భాగంగా అత్యంత అద్భుతంగా షిరిడీ లో ఉన్న మాదిరిగానే మందిరంలో వెండి తాపడం పనులకు నా వంతుగా సహాయాన్ని అందజేసినాము అని తెలియజేశారు. మందిర గౌరవాధ్యక్షులు  పి గౌతమ్ రెడ్డి  మాట్లాడుతూ మందిరంలో ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తుల సహాయ సహకారాలు మరువలేనివి వారికి ఎన్నడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము అని తెలిపారు. ఈ మందిరం లో ఉండే విశేష శక్తి వల్ల బాబా వారిని భక్తులు ప్రతిరోజూ దర్శనం చేసుకొని వారు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏ కార్యక్రమానికైనా భక్తులు విరివిగా వారి యొక్క సహాయ సహకారాలు అందజేయడం వల్ల ఎటువంటి పెద్ద కార్యక్రమమైన కూడా మాకు శ్రమ లేకుండానే బాబా వారి అనుగ్రహముతో  దిగ్విజయముగా పూర్తి అగుచున్నది అని మందిర గౌరవాధ్యక్షులు తెలియజేసారు. కావున భక్తులందరూ కూడా మీ శక్తి కొలది కొత్త వెండి లేదా మీ ఇంట్లో వాడే పాత వెండి వస్తువులు అయినా సరే సమర్పించి శాశ్వతంగా ఉండేటటువంటి  రజక తాపడం లో మీరు కూడా భాగస్వాములు కావలసినదిగా మందిర గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి  తెలియజేసారు. ఈ కార్యక్రమములో మందిర గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి  మరియు మందిర సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోషన్ ప్లస్ కార్యక్రమం ద్వారా అవగాహాన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం

-అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి -జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.. నిత్య ఆహారంలో పోషక విలువలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *