విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైస్ జగన్మోరెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తూ రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం నియోజకవర్గంలోని 13వ డివిజన్ లోని 54వ సచివాలయ పరిధిలోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ ప్రాంతంలో ఇంటి ఇంటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరిస్తూ,స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లడుతూ కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ,మరోపక్క అభివృద్ధి పనులు ముమ్మరంగా పూర్తి చేస్తున్న ఘనత మన వైసీపీ దే అని అన్నారు .రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ డివిజన్ లో గడప గడప కు వెళ్తుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.విద్యా, వైద్యం,సేద్యం ఈ మూడు రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలు ఎంతో సంతోషముగా వున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి పైరవీలకు తావులేకుండా తూర్పు నియోజకవర్గంలో సంక్షేమం,అభివృద్ధి అందిస్తే స్థానిక ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని,గత ప్రభుత్వం లో ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే అన్ని అర్హతలు ఉన్న సరే కేవలం మీ పార్టీ వాళ్ళకి అందులో మీ జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తేనే వచ్చే పరిస్థితి ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీ షో రాజకీయాలు, డ్రామాలు ప్రజలకు అర్థం అయ్యాయి రాబోయే ఎన్నికల్లో వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఇకనైనా అబద్ధపు ప్రచారాలు కట్టిపెట్టాలని హితవు పలికారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ ఇంచార్జ్ రమాయణపు శ్రీనివాస్, కార్పొరేటర్లు అంబేద్కర్, సాంబయ్య, వైస్సార్సీపీ నాయకులు ఉకోటి రమేష్, సుబ్బరాజు, ఎర్రమోతూ శ్రీను, పిడుగు విజయ్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …