బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లా, పిట్టలవానిపాలెం మండలం, చందోలు గ్రామం నందు వేంచేసియున్న శ్రీశ్రీశ్రీబగళాముఖి అమ్మవారు శ్రావణమాసం మూడో శుక్రవారం, పౌర్ణమి సందర్భంగా “శ్రీ మహాలక్ష్మి” అవతారంలో విశేషంగా భక్తుల పూజలు అందుకున్నారు. కోరిన కోరికలు తీర్చే జగన్మాతగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ కొలువైన ఈ అమ్మవారు. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటున్నారు. ఈ దేవస్థానంలోని అమ్మవారిని మనస్ఫూర్తిగా… మంచిగా ఏమి కోరుకుంటే అది త్వరగా నెరవేరుతుందని భక్తుల సంపూర్తి నమ్మకం. అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరికీ, సమస్త లోకానికి శుభాలు జరగాలని పూజారులు, వేద పండితులు అత్యద్భుత పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణఅధికారి జి. నరసింహమూర్తి, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోదుగుల ప్రభాకర్ రెడ్డి, సభ్యులు బలరామ కృష్ణమూర్తి, భక్తగణం మరియు ఆలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
సమర్ధవంతంగా శాప్ విధులు
-ప్రణాళికాబద్ధంగా క్రీడల అభివృద్ధి -త్వరితగతిన క్రీడాభివృద్ధి పనులు -స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక …