Breaking News

పీఎంఎఫ్ఎంఈ రిసోర్స్ ప‌ర్స‌న్స్ ఎంపిక‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

– అర్హులైన వారు ఈ నెల 8వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎస్ఈఈడీఏపీ), డీఆర్‌డీఏ సంయుక్త ఆధ్వ‌ర్యంలో పీఎం ఫార్మ‌లైజేష‌న్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంట‌ర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) ప‌థ‌కం కింద జిల్లా రిసోర్స్ ప‌ర్స‌న్స్ ఎంపిక‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప‌థ‌కం ద్వారా క్రెడిట్ లింక్డ్ స‌బ్సిడీతో చిన్నత‌ర‌హా ఆహార ప్రాసెసింగ్ ఎంట‌ర్‌ప్రైజెస్‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఎంపికైన అభ్య‌ర్థులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రిసోర్స్ ప‌ర్స‌న్స్‌గా నియ‌మించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌తి మండ‌లానికి ఇద్ద‌రు రిసోర్స్ ప‌ర్స‌న్లను రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌థ‌కానికి అర్హుల‌ను గుర్తించ‌డం, ప‌థ‌కం వివ‌రాలు వివ‌రించ‌డం, డీపీఆర్‌ల రూప‌క‌ల్ప‌న‌, రుణాలను స‌మ‌కూర్చ‌డంలో స‌హాయం వంటి ప‌నులు రిసోర్స్ ప‌ర్స‌న్లు నిర్వ‌హిస్తారన్నారు. రిసోర్స్ ప‌ర్స‌న్ల‌కు స్థిరమైన వేత‌నం కాకుండా ప్ర‌తిభ ఆధారంగా ప్రోత్సాహ‌కాలు అందించ‌డం జ‌రుగుతుంద‌ని, ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుడు బ్యాంకు రుణం పొందిన త‌ర్వాత రూ. 10 వేలు, డీపీఆర్ ప్ర‌కారం యూనిట్ స్థాప‌న‌, అధికారిక‌త పూర్త‌యిన త‌ర్వాత మ‌రో రూ. 10 వేలు అందిస్తార‌ని వివ‌రించారు. 2024, న‌వంబ‌ర్ 1 నాటికి 21-30 ఏళ్లుండి, డిగ్రీ చ‌దువుకున్న యువ‌తీయువ‌కులు రిసోర్స్ ప‌ర్స‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని, స్మార్ట్ ఫోన్ క‌లిగి ఉండ‌టంతో పాటు ఇంట‌ర్నెట్‌, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాల‌న్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లేదా నేచుర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్య‌క‌లాపాల్లో అనుభ‌వ‌మున్న వారికి లేదా స్థానిక మండ‌లాల వారికి ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నారు. అర్హులైన వారు https://forms.gle/34TwTSQV8iSUMV8P6 లింక్ ద్వారా ఈ నెల 8వ తేదీలోగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌న్నారు. ఇత‌ర వివ‌రాల‌కు 8019099919లో సంప్ర‌దించొచ్చ‌ని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *