Breaking News

నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కావడంతో పుదుచ్చేరి సీ ఎం ఇంటికి వచ్చారు…

-మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల అభినందలు తెలిపేందుకు వచ్చారు
-షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వర్యులు, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్. రంగస్వామి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి విచ్చేసి ముఖ్యమంత్రి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అజీజ్ నివాసంలో అల్పాహారం సేవించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ..తను వక్ఫ్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి కి తనకి ఉన్న సాన్నిహిత్యం వల్ల తనను అభినందించేందుకు యా కు వెళ్ళే దారిలో నెల్లూరులోని తన నివాసానికి వచ్చారని అజీజ్ తెలిపారు. అందరం కలిసి అల్పాహారం సేవించామని, చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమని చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుందని రంగస్వామి కొనియాడారు అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *