విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులలో సాంకేతిక ప్రతిభను వెలికితీసి, వారిని వినూత్న ఆవిష్కరణల వైపు నడిపించడానికి రాష్ట్ర స్థాయి poly tech fest లు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు G. గణేష్ కుమార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన “POLY TECHFEST 2024-25” స్టేట్ మీట్ ను విజయవాడ S.S. కన్వెన్షన్ హాల్ లో సోమవారం సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు G. గణేష్ కుమార్, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా G. గణేష్ కుమార్ మాట్లాడుతూ TECHFEST కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ “ఈ సాంకేతిక ప్రదర్సన 2018 సంవత్సరం లో ప్రారంబించడం జరిగిందని, డిప్లొమా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించడం జరగుతుందని తెలియజేసారు. గత డిసెంబర్లో వారం రోజుల పాటు , ప్రాంతీయ టెక్ ఫెస్ట్ లు పూర్వపు 13 జిల్లాల ప్రధాన కార్యాలయాలలో నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా 1302 ప్రాజెక్టులు ప్రదర్శించబడితే, ప్రతి ప్రాంతo నుండి 15 నుంచి 20 ప్రాజెక్టులను ఎంపిక చేయగా మొత్తంగా 249 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయబడ్డాయని ఆయన తెలిపారు. విజేత ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిష్ణాతులైన అధ్యాపకులు, వ్యవస్తాపకులు మరియు టెక్నోక్రాట్స్ ద్వార చేయబడుతుందని తెలిపారు. ప్రాంతీయ స్థాయిలో పోటీని తట్టుకుని విజేతగా ఎన్నికవడం ఎంత కష్టమో, రాష్ట్ర స్థాయి పోటీని తట్టుకుని విజేతగా నిలవడం మరింత కష్టమని, ఈ స్థాయి వరకు చేరుకున్న విద్యార్థులను, పరికరాలను తయారుచేయడంలో వారికి సహకరించిన డిప్లొమా అధ్యాపకులను శ్రీ. G. గణేష్ కుమార్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన పరికరాలను తయారుచేయాలనీ, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న సాంకేతిక విభాగం ప్రధాన కార్యదర్శి, శ్రీ.కోన శశిధర్ కు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ ప్రదర్శనలో భాగంగా 243 ప్రాజెక్టులను 124 స్టాళ్ళలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులను IOT, drones, సౌరశక్తి, రిమోట్ సెన్సింగ్, AI, RF మరియు Bluetooth వంటి అత్యాధునిక సాంకేతికల సహాయంతో తయారుచేయడం జరిగింది. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను డైరెక్టర్ G. గణేష్ కుమార్ పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడుతూ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ యొక్క ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాలు, వాటి పని తీరు, వాటిని ఏర్పాటు చేయడం లో గల ముఖ్య ఉద్దేశ్యాన్ని అడిగి తెలుసుకుంటూ 33/11 kv సబ్ స్టేషన్ మోడల్ ను పరిశీలించారు. విద్యార్థుల ప్రదర్శనలో భాగంగా నదిపై ఏర్పాటుచేసిన బ్రిడ్జ్ నాలుగు వైపులా రోడ్డును కలిపేలా తిప్పేలా చేసిన ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్ లో భాగంగా 13 అత్యుత్తమ ప్రాజెక్టులకు బహుమతి అందచేస్తామన్నారు.రానున్న రోజుల్లో టెక్ ఫెస్ట్ కు మరింత ప్రోత్శాహం అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి V.పద్మ రావు, జాయింట్ డైరెక్టర్, J.సత్యనారయణ మూర్తి, A.U రీజినల్ జాయింట్ డైరెక్టర్, కాకినాడ, A.నిర్మల కుమార్ ప్రియ S.V.U రీజినల్ జాయింట్ డైరెక్టర్, G.V. రామచంద్ర రావు, కార్యదర్శి (FAC) SBTET మరియు ఇతర ప్రముఖులు, అధ్యాపకులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News