Breaking News

కన్నడ కల్చర్ డిపార్ట్మెంట్ అధ్యయనం తప్పక ఉపయోగపడ్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కర్ణాటక కన్నడ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ,IPS ఆఫీసర్ ధరణిదేవి మాలగట్టి మరియు జాయింట్ డైరెక్టర్స్ ,అకాడమీ ఛైర్పర్సన్స్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి . కర్ణాటకలో అమలవుతున్న కల్చర్ ప్రమోషన్ ఆక్టివిటీస్ మరియు విధి విధానాలను స్పష్టంగా తెలుసుకున్న తేజస్వి, ప్రెసెంటేషన్ ద్వారా డిపార్ట్మెంట్ లోని కీలక విషయాలను తెల్సుకున్న తర్వాత స్వయంగా సంగీత, నాటక, సాహిత్య, నృత్య , చిత్ర కళా, శిల్ప కళా అకాడెమీస్ ని సందర్శించి వారి ఛైర్మన్స్ తో వారి వివిధ విభాగాల్లో అమలవుతున్న కార్యక్రమాలు తెలుసుకోవడం జరిగింది. రవీంద్ర కళాక్షేత్ర ఆడిటోరియం , kanaja వెబ్సైటు , సాహిత్య గ్రంధాలయం మరియు ఇతర అంశాలపై చర్చించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళలు , కళాకారులను మరియు సంస్కృతిని వృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడంలో ఈ కన్నడ కల్చర్ డిపార్ట్మెంట్ అధ్యయనం తప్పక ఉపయోగపడ్తుంది అని తెలియజేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *