Breaking News

వంద రోజుల్లో వంద రోడ్లు ప్రారంభం

పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వ పాలనలో వంద రోజులలో వంద పనులు సాధించి సాలూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించాలనే కృతనిశ్చయంతో ఎమ్మెల్యేగా నియోజక వర్గాన్ని ముందుకు నడిపిస్తున్న స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకున్నారు. సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడానికి “పల్లె పండగ” పథకం క్రింద వచ్చిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో రూ.357 లక్షలతో వందరోజుల్లో వంద పనులు విజయవంతంగా పూర్తి చేశారు. వీటితోపాటు గర్భిణుల సహాయకులు కోసం రూ.10.80 లక్షలతో అదనపు వసతి గృహాన్ని నిర్మించి ఇప్పటికే ప్రారంభించారు. సాలూరు వంద పడకల ఆసుపత్రి పూర్తి చేయాలని చర్యలు చేపడుతున్నారు. పాచిపెంటలో రూ.1.80 కోట్లతో నిర్మించి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు అదనపు వసతి కల్పించారు. ఉపముఖ్యమంత్రి గత డిసెంబర్ 20న ప్రారంభోత్సవం చేసిన 19 పనుల్లో ఐదు రోడ్డు పనులు సాలూరు నియోజకవర్గానికి చెందిన పనులు ఉన్నాయి.

సోమవారం మక్కువ మండలంలో నిర్మించిన 35 సి సి రహదారులను కాశీపట్నంలో మంత్రి సంధ్యా రాణి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని మంచి రోజులేనని అన్నారు. రాష్ట్రంలోనే వినూత్నమైన  వంద రోజుల్లో వంద రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో గుంతలతో రోడ్లు దారుణమైన స్థితిలో ఉన్నాయని, అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పల్లెలు, పట్టణాలు తేడా చూడకుండా తారు రోడ్డు, సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామ కమిటీ గ్రామస్తులు అందరు ఏకగ్రీవంగా కోరుకున్న విధంగానే రోడ్ల నిర్మాణం పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో మక్కువ మండపంలో 35 రోడ్లు, సాలూరు మండలంలో 22, పాచిపెంట మండలంలో 27 రోడ్లు, మెంటాడ మండలంలో 20 రోడ్లతో కలిపి మొత్తం 102 రోడ్ల నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని మంత్రి అన్నారు. సుమారు రూ:5 కోట్లతో 100 రోడ్ల నిర్మాణం  పూర్తి చేయడం జరిగిందని వివరించారు. పది కోట్లతో అయిదు బిటి రోడ్ల నిర్మాణం జరిగితోందని, ఇంకా ఎక్కడైనా రోడ్లు లేని చోట్ల రోడ్ల నిర్మాణం చేపడతామని ఆమె అన్నారు. సాలూరు నియోజకవర్గానికి సుమారు ఎనబై కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేసామని తెలిపారు. రూ: 70 కోట్లతో నియోజకవర్గంలో కొత్తగా 110 అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేసి, 63 అంగన్వాడీ టీచర్లు,ఆయాల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి స్థానిక నాయకులు కూడా సహకరించాలని ఆమె కోరారు. మక్కువ మండలానికి కోటి ఇరవై లక్షల రూపాయలతో 11 రోడ్లు మంజూరు చేయిస్తే, నేటికీ రోడ్లు ప్రారంభించకుండా  అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని నాలుగు వేలు పింఛన్ మన రాష్ట్రం ఇస్తోందని తెలిపారు. పేద, వృద్ధుల, వికలాంగుల కష్టం తెలిసిన మనిషి చంద్రబాబు నాయుడు అని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా కాశీ పట్నం కేజిబివి పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై మాట్లాడారు. ఆహార పదార్థాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మక్కువ మండల తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, ఎం.పి. డి. ఓ. డి. డి స్వరూప రాణి, పంచాయితీ రాజ్ డి. ఇ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *