Breaking News

పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని గుర్తించిన ముఖ్యమంత్రి…

-మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
చదువుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని గుర్తించిన మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన గూడూరు నియోజకవర్గ పరిధిలో పోలవరం గ్రామంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పోలవరం గ్రామంలో జరిగిన పలు అధికారక కార్యక్రమాలలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. తొలుత గ్రామీణ నీటి సరఫరా , పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో జల జీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా 32 లక్షల రూపాయల వ్యయంతో ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసి తాగునీరు అందించే పథకానికి శంకుస్థాపన చేశారు. తర్వాత అదే గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేత 15 లక్షల రూపాయలు వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య సంరక్షణ, వికాస కేంద్రం ఆయుష్మాన్ భారత్ ను మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు.
అనంతరం పోలవరం గ్రామంలోని తోట వెంకటసుబ్బయ్య మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రవాస పొలవరం వాసుల ఐక్య వేదిక సహాయంతో నిర్మించబడిన వంటగది, భోజనశాల భవనంను ప్రారంభించారు. పోలవరం మండల పరిషత్ ప్రాధిమికోన్నత పాఠశాల స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జరిగిన ప్లాటినం జూబ్లీ కార్యక్రమాలలో భాగంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 15 వ తేదీ ( సోమవారం ) దేశవ్యాప్తంగా జరగబోయే 75 వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగానే మీ అందరికి శుభాకాంక్షలు. తెలియచేస్తున్నాను అంటూ హర్షద్వానాల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు. విద్య విలువ కట్టలేని సంపదని, తమది చదువు విలువ తెలిసిన ప్రభుత్వమని అన్నారు. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతారని అందుకే ఆయన ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో విద్య, వైద్యం కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. చిన్నారుల మధ్యాహ్న భోజనం గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చదువంటే నాడు భయపెట్టె విధంగా ఉండేదని, నేడు భయం పోగొట్టేదిగా నిలిచిందన్నారు. విద్య విలువ తెలిసి.. ఆ విలువను మరింత పెంచడానికి, అందరికీ పంచడానికే ‘నాడు-నేడు’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. ప్రతీ విద్యార్థి తాను చదివింది గవర్నమెంట్ స్కూల్ అని గర్వంగా చెప్పుకునేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని, ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు తొమ్మిది రకాల మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన పోలవరం పాఠశాలలో చదువుకొన్న విద్యార్థిని విద్యార్థులు ఎంతో ప్రయోజకులై ఎక్కడెక్కడో స్థిరపడినవారు ఈ ప్రాంతంపై మమకారం కల్గి తమ ప్రాంత స్కూల్ ను అభివృద్ధి చేయాలని యోచన చేయడం ఎంతో అభినందనీయమని మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలవరం సర్పంచ్ నక్కిన వెంకట నాగరాజు, ఎం పి పి సంగా మధుసూదన రావు, వైస్ ఎం పి పి పిచ్చుక గంగాధర్, గూడూరు జడ్పిటిసి సభ్యుడు వేముల సురేష్ బాబు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకట కృష్ణారావు, గూడూరు రైతు భరోసా కేంద్రాల ఛైర్మెన్ పర్ణం పెదబాబు , గొరిపర్తి రవి గూడూరు తహశీల్ధార్ విజయ ప్రసాద్, ఎం పి డి ఓ సుబ్బారావు, ఎం ఇ ఓ కె.ఎస్ ఎన్ ప్రసాద్, ఆరోగ్య సంరక్షణ, వికాస కేంద్రం ఆయుష్మాన్ భారత్ వైద్యులు డాక్టర్. వి. శివరామక్రిష్ణ, వి ఆర్ ఓ కుందేటి ఉషారాణి, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, గ్రామ సచివాలయ వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *