గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నాటి స్వాతంత్ర్య పోరాట చరిత్ర, నాయకుల త్యాగాలను భావి తరాలకు వివరించేందుకే కేంద్ర ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తుందని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) డి.శ్రీనివాసరావు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ ఆదేశాల మేరకు గుజ్జనగుండ్ల సెంటర్ నుండి కోరేటేపాడు మీదుగా ఎన్.టి.ఆర్.స్టేడియం వరకు విద్యార్ధుల సైకిల్ ర్యాలీ జరిగింది.
ర్యాలీని ప్రారంభించిన అదనపు కమిషనరు మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1 నుండి 15వ తేది వరకు నగరపాలక సంస్థ ఆధ్వరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఫ్యాన్సీ డ్రస్ (స్వాతంత్ర్య పోరాట యోధుల వేష దారణ), మ్యూజికల్ (దేశభక్తీ గేయాలు), డ్యాన్స్ (జాతీయతను పెంపొందించేవి) పోటీలను ఎన్.టి.ఆర్.స్టేడియంలో నిర్వహించామని, సదరు కార్యక్రమాల్లో విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఆదివారం సైకిల్ ర్యాలీ చేపట్టామన్నారు. నేటి యువత మరియు విద్యార్ధులకు నాటి స్వాతంత్ర్య పోరాట చరిత్ర, త్యాగాలను తెలియచేయడానికి ఆజాదికా మహోత్సావ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. సోమవారం నగర మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి, ఎన్.టి.ఆర్.స్టేడియంలో ఎన్.సి.సి. క్యాడెట్ ల గౌరవ వందనం స్వీకరిస్తారని, కార్యక్రమం నగర కమిషనర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి సభ్యులు నిమ్మల వెంకట రమణ, గ్రీన్ కోర్ జిల్లా కొ ఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News