విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ ఆదిశంకరాచార్య గోసేవా ట్రస్ట్ విజయవాడ వారు దేశభక్తి, దేశ సేవలో భాగంగా మువ్వెన్నల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య గోసేవా ట్రస్ట్ చైర్మన్ పి.ఎం.ఆర్ కామేశ్వరరావు విజయవాడ నగరంలో జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరవేద్దాం… దేశ భక్తి చాటుదాం అనే నినాదం తో ఉచితంగా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో 40 రూపాయలు విలువచేసే జాతీయ జెండాను 20 రూపాయలకే పంపిణీ చేశామన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తయిన, వజ్రోత్సవాలు సందర్భంగా ప్రతి భారతీయుడు తన ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని, ప్రతి వాహనంపై ఆగస్టు 15 రోజున జాతీయ జండా ఎగరాలని, ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంచుకుంటూ, దేశభక్తి నీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ దేశభక్తిని నింపుకోవాలని, ప్రతి ఒక్కరూ తన కర్తవ్యం గా భావించి, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేస్తూ దేశ సమగ్రతను, దేశ ప్రతిష్టను, దేశభక్తిని పెంపొందించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ సేవలో భాగస్వామ్యం అవ్వాలని కోరుతూ స్వయంగా జాతీయ జెండాను తయారుచేసి ప్రజలందరికీ మూడు రంగుల మువ్వన్నెల జాతీయ జెండాను పంపిణీ చేశామన్నారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …