Breaking News

జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు

-ధ్యానం, నాట్యం, సంగీతం వలన ఆరోగ్యం
-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వెల్లడించారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్లేపల్లిలోని సంప్రదాయంలో ఆనందోబ్రహ్మ మరియు స్పిరిట్యువల్ టాబ్లెట్స్ వారిచే హంసధ్వని తొమ్మిదో వార్షికోత్సవం, సంప్రదాయం గురుకులం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు 12వ తేదీ నుండి 14 వరకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ధ్యానం చేస్తుంటే ఎంతో రిలేక్ష్ గా ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ ఆనందింపజేస్తాయన్నారు. కళలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలు మరువలేనివని వివరించారు. ఆనాడు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే శిల్పారామంకు భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. ధ్యాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ధ్యానం, నాట్యం, సంగీతం వలన మంచి ఆరోగ్యం కలుగుతుందన్నారు. రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మెడిటేషన్ మూఢనమ్మకాలు కాదన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ సంప్రదాయం శ్రీకాకుళానికి పెద్ద ఆస్తి అని కొనియాడారు. ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకు ఫోక్ ఆర్టిస్టులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం హంసధ్వని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చామంతి పువ్వా పువ్వా పాటకు స్టెప్ లు కొట్టి జనాలను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, శాసన సభ్యులు వి. కళావతి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఎం. పద్మావతి, హంసధ్వని డైరెక్టర్ డాక్టర్ జి. గోపాలకృష్ణ, సంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *