-జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయర్
-నగరపాలక సంస్థ జెండాను అవిష్కరించిన కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, ఆవుతు శ్రీశైలజా రెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, బొయి సత్యబాబు, పలువురు కార్పొరేటర్లతో కలిసి గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తదుపరి మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, నగరపాలక సంస్థ జెండాను కమిషనర్ ఎగురవేసారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్ధుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొనిన సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 75 వారాల పాటు స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తున్నట్లు మరియు ఆగష్టు 1వ తేది నుండి నేటి వరకు ప్రతి రోజు ఆజాద్ కా అమృత్ హోత్సావ్ ద్వారా నగరపాలక సంస్థ అద్వర్యంలో స్వచ్చ స్వాతంత్యాని సదించుటకై ప్రాణ త్యాగాలను చేసిన ఎందరో మహానుభావులైన స్వాతంత్య్ర సమయోధులను స్మరించుకోనుచు దేశానికి వారి చేసిన త్యాగాల పట్ల నేటి యువతకు తెలియజేసేలా మరియు ప్రజలలో దేశ భక్తిని మరియు స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తి కలిగించే విధంగా అనేక కార్యక్రమములను నిర్వహించుకోవటం జరిగిందని పేర్కొన్నారు. స్వచ్చ స్వాతంత్య్ర వచ్చిన ఈ 75 సంవత్సరాలలో మన నగరం అభివృద్ధి పధంలో పయనిస్తున్నదని, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికుల కృషి ఫలితంగా అనేక అవార్డు లను కైవసం చేసుకోవటం జరిగిందని, అందరు సమిష్టి కృషితో మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. గాంధీజీ ఆశయాలను అనుగుణంగా ఆయన కలలు కన్న గ్రామా స్వరాజ్యం కులాల, మతాలు పార్టీలకు అతీతంగా సచివాలయం వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాలనా చేస్తూ, ప్రతి ఒక్కరికి లబ్దిని చేకూరే విధంగా సంక్షేమ పథకములను అందిస్తూ, అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా పాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి ప్రత్యెక ధన్యవాదాలు తెలియజేసారు.తదుపరి కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ముందుగా అందరికి 76వ స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 75 వారాలు పాటు ఆజాద్ కా అమృత్ మహోత్సావ్ కార్యక్రమముల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమము నిర్వహించుట జరిగిందని అన్నారు. ముఖ్యంగా స్వాతంత్య్రనికి ముందు నుండే విజయవాడ నగరపాలక సంస్థ ఉంది దాదాపుగా 120 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన మన కార్పోరేషన్ మినియన్ ప్లస్ సిటిగా రూపాంతరం చెంది అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని, శానిటరీ సిబ్బంది కృషితో నగరాన్ని అవార్డు లు సాదించుటలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ప్రజల కోసం మనందరం పని చేస్తున్నము, అందరి సమిష్టి కృషి రాబోవు రోజులలో మరిన్ని అవార్డులు సాదించే దిశగా మరియు ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా పని చేయాలని అన్నారు.
అనంతరం నగర పాలక సంస్థ నందు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 102 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రములను అందించారు.కార్యక్రమములో ఫ్లోర్ లీడర్లు వెంకట సత్యనారాయణ, బోయి సత్యబాబు మరియు పలువురు కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ (జనరల్) డా.యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ఇతర విభాగముల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.a
Prajavartha Online Telugu News