విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న లేఅవుట్లలో లబ్దిదారుల రిజిస్ట్రేషన్ల లక్ష్యాల సాదనలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పదని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను హెచ్చరించారు.జగనన్న లేఅవుట్లలో పేదలకు మంజూరైన గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, కలెక్టరేట్‌లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో హౌసింగ్ మండల స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 303 లేఅవుట్లలలో 1లక్ష 4 వేల 770 ప్లాట్లకు గాను నేటి వరకు 67,638 మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవడం పట్ల జిల్లా కలెక్టర్ ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. చేసిన వాగ్దానాన్ని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేలా నిబద్దతతో అధకారులు పనిచేయాలన్నారు. హౌసింగ్ ఏఇలు విలేజ్ రెవెన్యూ అధికారులు విలేజ్ సర్వే అధికారులు సంయుంక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. నవరత్నాలు, పేదలందరికి ఇళ్లు పథకం ద్వారా జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న గృహాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న లబ్దిదారుల వివరాలను రిజిస్ట్రేషన్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరువూరు డివిజన్ పరిధిలో 4 లేఅవుట్లలో 1,175 ప్లాట్లకుగాను 618 ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని, నందిగామ డివిజన్ పరిధిలో 231 లేఅవుట్లలో 23,451 ప్లాట్లకుగాను 14,048 ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని, విజయవాడ డివిజన్ పరిధిలో 68 లేఅవుట్లలో 80,144 ప్లాట్లకు గాను 52,972 ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని మిగిలిన వాటిని త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి లబ్దిదారులతో గృహా నిర్మాణాలను ప్రారంభింప చేయాలని కలెక్టర్ డిల్లీరావు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వెనుకబడిన ఉన్న మండలాల హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తూ వారంలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రగతి చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, హౌసింగ్ పిడి ఏ. శ్రీదేవి, ఇఇ రవికాంత్, జిల్లాకు చెందిన డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News