Breaking News

గంగమ్మ చెంతకు పైనాపిల్ గణనాథుడు…

-ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన వినాయకుడు
-1116 కేజీల లడ్డూ భక్తులకు ఉచితంగా పంపిణీ
-యువతను ఆకట్టుకున్న ఉట్లోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదు రోజులుగా నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిచ్చిన భారీ పైనాపిల్ గణనాథుడు ఆదివారం జరిగిన నిమజ్జనంతో గంగమ్మ చెంతకు చేరాడు. తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంట గ్రామంలోని బాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పైనాపిల్ వినాయకున్ని వేలాది మంది భక్తులు తరలి వచ్చి దర్శించుకున్నారు. వినాయక చవితి రోజు నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు నిరంతరాయంగా దర్శనం కల్పించారు.

ఫైర్ ఇంజన్ సాయంతో నిమజ్జనం
తిరుపతి నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ సహాయంతో 22 అడుగులు ఎత్తు, 15 అడుగులు వెడల్పుతో ఏర్పాటు చేసిన భారీ పైనాపిల్ వినాయకుని నిమజ్జనంను ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ ఇంజన్ నుంచి వచ్చే నీటిలో సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమలను కలిపి నిమజ్జన కార్యక్రమంను లాంచనంగా ప్రారంభించారు.

1116 కేజీల లడ్డూ ఉచితంగా పంపిణీ
భారీ పైనాపిల్ వినాయకుని ప్రతిమకు నైవేద్యంగా పెట్టిన 1116 కేజీల లడ్డుతో పాటు వినాయకుని ప్రతిమకు ఏర్పాటు చేసిన పైనాపిల్స్ ను బాల వినాయక కమిటీ ఛైర్మన్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, సభ్యులు నిమజ్జనంలో పాల్గొన్న భక్తులు అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు.

యువతను ఆకట్టుకున్న ఉట్లోత్సవం
పైనాపిల్ వినాయకుని నిమజ్జనంలో భాగంగా ఆదివారం జరిగిన ఉట్లోత్సవం యువతను ఆకట్టుకుంది. పైనాపిల్ వినాయకుని మండపం ముందు ఉట్టి కొట్టిన కుర్రాళ్ళు సందడి చేశారు. అలాగే చివరి రోజున పైనాపిల్ వినాయకుని దర్శనార్థం వచ్చిన భక్తులు అందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ప్రసాదాలను నిరంతరాయంగా అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్షతగాత్రులై  స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులకు ఇచ్చిన హామీ మేరకు తమని తమ స్వంత ప్రాంతాలకు వాహనాలలో పంపిస్తూ మరియు శ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *