-8, 9, 10 తరగతి ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్ లో చదివే విద్యార్థులు అర్హులు
-దరఖాస్తు కు చివరి తేదీ నవంబర్ 30
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రీలయన్స్ కార్పొరేట్ సంస్థ సి ఎస్ ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యాచరణ లో భాగంగా విద్యాభివృద్ధికై పోటీ పరీక్షల ను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా గోడ ప్రతులను తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లా పరిధిలో ప్రదర్శించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ సి ఎస్ ఆర్ ప్రతినిధి పి. సుబ్రహ్మణ్యం తో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు లలో 8 , 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు నవంబర్ 30 లోగా వారి పేర్లు నమోదు చేసుకోవలసి ఉంటుందన్నారు. ప్రతి స్కూల్ నుంచి ఒక బృందం ఇద్దరూ చొప్పున రెండు బృందాలు ఆయా స్కూల్స్ తరపున వారి పేర్లు తెలియచెయ్యాలని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రవాణా ఖర్చులను సంస్థ చెల్లించనున్నట్లు డి ఈ ఓ అబ్రహం తెలియచేశారు.
రిలయన్స్ సంస్థ సి ఎస్ ఆర్ ప్రతినిధి పి.సుబ్రహ్మణ్యం వివరాలు తెలుపుతూ జనరల్ నాలెడ్జి, ప్రపంచ మరియు భారత దేశ చరిత్ర, సమకాలిన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రవేట్ విద్యార్ధులకు సమాన అవకాశాలు ఇవ్వడం తో పాటు గా, ప్రభుత్వ, ప్రవేటు స్కూల్స్ పిల్లలకి విడివిడిగా క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు.
పేర్లు రిజిస్ట్రేషన్ కోసం 📞0844- 6677555 ; 6302223156 నంబర్ లకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 నుంచీ సాయంత్రం 5 వరకు 30.11.2022 వరకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30.11.2022. మరింత సమాచారం కోస 📞0844-6677555 ; 99599 88835 నంబర్ లను కూడా సంప్రదించ గలరని తెలిపారు.
డిసెంబర్ 6 మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని విద్యార్థిని విద్యార్థులకు శ్రీ ఆనం వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం లో, డిసెంబర్ 7 బుధవారం నాడు డా. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం లోని అంబేడ్కర్ భవనంలో, డిసెంబర్ 8 గురువారం నాడు కాకినాడ జిల్లా, కాకినాడ లోని అంబేడ్కర్ భవనం లో క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా రోజుల్లో మ.12 గంటల నుంచి క్విజ్ పోటీలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.