Breaking News

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందితో పాటుగా పై అధికారుల పై కఠిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందితో పాటుగా పై అధికారుల పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్.  స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ కోబాల్ట్ పేట, కృష్ణ నగర్, విద్యా నగర్, నవ భారత్ నగర్, జెకెసి కాలేజి రోడ్, కల్యాణి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుద్యం నిర్వహణ, ఆక్యుపెన్సి కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ప్రజారోగ్య రక్షణలో పారిశుద్యం ఎంతో ప్రదానమైన అంశమని, పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బంది, పర్యవేక్షణ అధికారుల పై శాఖాపరమైన చర్యలు తీసుకుకోక తప్పదన్నారు. కోబాల్ట్ పేటలో స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు చేసిన ఆకస్మిక పర్యటనలో పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉండటం, రోడ్ల మీద చెత్త కుప్పలు పడి ఉండటం, ప్లాస్టిక్ కవర్లు వినియోగం తదితర అంశాలను గమనించి, గత పర్యటనల్లో హెచ్చరించినా నిర్లక్ష్యంగా ఉన్న 122, 123 వార్డ్ సచివాలయాల శానిటేషన్ కార్యదర్శులు అనూష, అరుణలను విధుల నుండి సస్పెండ్ చేయాలని, 122 సచివాలయ అడ్మిన్ కార్యదర్శికి, శానిటరీ ఇన్స్పెక్టర్లు భాస్కర్, అంగడి బాబులకు చార్జి మెమోలు ఫైల్ చేయాలని ఆదేశించారు. అలాగే పర్యవేక్షణలో లోపంపై సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయ లక్ష్మి, డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, శానిటరీ సూపర్వైజర్ రాంబాబులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. కల్యాణి నగర్ లో డ్రైన్ శుభ్రం, గ్యాంగ్ వర్క్ లో అలసత్వం పై 107 వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శి వసంతరావు, శానిటరీ ఇన్సెపెక్టర్ డేవిడ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
అనంతరం ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాలను పరిశీలించి భవనాలు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్ లు నామమాత్రం కాకుండా పక్కాగా పని చేసేలా కనెక్షన్ చేయాలని, సచివాలయ కార్యదర్శులు పక్కాగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం గ్రీనరికి కేటాయింపు ఉండాలన్నారు. కాల్వల్లో సిల్ట్ తీయడానికి వీలుగా ర్యాంప్ లు నిర్మాణం చేసుకోవాలని, లేని వాటిని తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్యటనలో సిటి ప్లానర్ మూర్తి, ఏ.సి.పి.లు బాబురావు, అజయ్ కుమార్, టి.పి.ఎస్. గోవర్ధన్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *