Breaking News

చేనేత వస్త్రాలు మన తెలుగు సంస్కృతికి చిహ్నాలు

-నేత వస్త్రాలను దరించి మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం..
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
చేనేత వస్త్రాలు మన సంస్కృతికి చిహ్నాలని వాటిని ధరించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కాప్ట్స్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని పివిపి మాల్‌ నందు ఏర్పాటు చేసిన హాండ్లూమ్‌ బజార్‌ను శనివారం డిల్లీరావు ప్రారంభించారు. ప్రదర్శనను తిలకించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ నేత కళాకారులు వారి కళానైపుణ్యం ద్వారా ఆధునిక డిజైన్లతో రూపొందించిన పలు చేనేత వస్త్రాలను ఒకే వేదికపై తీసుకువచ్చి వినియోగదారులకు అందుబాటులో తీసుకువచ్చేందుకు కాప్ట్స్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌ నాలుగు రోజుల పాటు చేనేత వస్త్ర ప్రదర్శన కళ రూపాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. సృజనాత్మకత ఉట్టి పడేలా యువత అభిరుచులకు అనుగుణంగా 2వ తేది ఆదివారం సాయంత్రం పలు రాష్ట్రాలలో తయారు చేయబడిన చేనేత వస్త్రాలను ధరించి ప్రదర్శన ఇవ్వడం ద్వారా నేత వస్త్రాల ప్రాముఖ్యతను తెలియపరచనున్నారన్నారు. ప్రదర్శనలో వెంకటగిరి, బండారులంక, మొర్రి, చల్లపల్లి, రాజోలు, పెద్దాపురం, పొందూరు, పోలవరం తదితర చేనేత వస్త్రాలను ప్రదర్శించి అమ్మకాలను నిర్వహిస్తున్నారన్నారు. నేటి తరానికి చెందిన వారి అభిరుచులకు అనుగుణంగా సహజ సిద్దమైన రంగులను ఉపమోగించి కాటన్‌ వస్త్రాలను తయారు చేయడం జరిగిందన్నారు. ప్రదర్శనలో పలు ఆధునాతన డిజైన్‌ వస్త్రాలతో యువతను ఆకర్షించేలా ఉన్నాయన్నారు.కాప్ట్స్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చేనేత కుటుంబాల కోసం పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. చేనేత కళాకారులకు ఆధునాతన డిజైన్లపై శిక్షణ ఇవ్వడం ఆరోగ్య శిబిరాలను నిర్వహించడంతో పాటు ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెట్‌ సౌకర్యం కల్పించడం వంటి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా ప్రజలు ఎగ్జిబిషన్‌ సందర్శించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా నేత కళాకారులు, కార్మికులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో కాప్ట్స్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి సూరెడ్డి రంజన, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ సుజాత, చేనేత కళకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, శోభాకరంద్లాజే తో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో రెండు రోజుల నిర్వహించిన ప్రవాస భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *