విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ విజిలెన్స్ అండ్ క్రైమ్ చైర్మన్‌గా లక్ష్మీవరప్రసాద్ ఎన్నికయ్యారు అని ఈమేరకు ఏపీ ప్రెసిడెంట్ షేక్ రాజీక్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో లక్ష్మీవరప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే కరప్షన్ ఫీల్డ్ లో యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నెంబర్వన్ ఆర్గనైజేషన్‌గా నిలిచింది అని, అవినీతికి వ్యతిరేకంగా అవగాహన, అవినీతి రహిత భారతదేశం, అవినీతికి వ్యతిరేకంగా కలిసి నిలబడటం ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న అవినీతి భూతాన్ని పారద్రోలేందుకు తన వంతు కృషి చేస్తానని చైర్మన్ తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారని తమ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే తమ ఫౌండేషన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అధికారులు అందరూ క్రమశిక్షణగా పని చేయాలని వారు సూచించారు. తనపై నమ్మకం ఉంచి ఏపీ చైర్మన్ ఇచ్చినందుకు ఏపీ ప్రెసిడెంట్ షేక్ రాజీక్, నేషనల్ ప్రెసిడెంట్ నరేందర్ అరోరలకు ఏపీ చైర్మన్ లక్ష్మీవరప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …