Breaking News

వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్‌ సర్కిల్‌లో ధర్నాచౌక్‌ నందు 13వ రోజు చేస్తున్న సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలకు సంఫీుభావం తెలుపుతూ మాజీ పార్లమెంట్‌ సభ్యులు, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ పని తాము చేసామని మిగిలిన పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాధినేత వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తక్షణం చర్యలు చేపట్టాలని వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు కూడా ఈ అంశంపై పూర్తి బలపరిచే దృక్పథంతో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా వారు చొరవచూపి వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని సభా వేదిక పక్షాన డిమాండ్‌ చేశారు. మరోనేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్‌రావు వాల్మీకులకు సంఫీుభావముగా విచ్చేసి వారి ప్రసంగంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల అప్పుడు మరియు మ్యానిఫెస్టోలో వాల్మీకులకు జరిగిన అన్యాయంపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి శాసనసభలో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్‌ అంశాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రంకి పంపిస్తానని చెప్పి ఇంతవరకు పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. వాల్మీకులు కులవృత్తి లేని కులమని వారు ఎస్టీ జాబితాలో ఉండాల్సిన నిజమైన గిరిజనులని ఈ సమస్యపై అన్ని వ్యవస్థలో వెంటనే స్పందించాలని లేనిచో తాము కూడా వాల్మీకుల కోసం ఉద్యమిస్తామని సభాపరంగా డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలకు సంఫీుభావముగా పదిమంది వాల్మీకి యువత బొమ్మనహాళ్‌ మండలం, బొమ్మనహాళ్‌ నుంచి పాదయాత్రగా బయలుదేరి 100 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ రాయదుర్గం నియోజకవర్గం, ఉరవకొండ నియోజకవర్గం, గుంతకల్‌ నియోజకవర్గంలో పూర్తిచేసి దీక్షా శిబిరానికి విచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి వాల్మీకులకు న్యాయం చేయాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రభుత్వాలు అదుపు చేయలేవన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వాల్మీకి సంఘం కన్వీనర్‌ బోయ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 13వ రోజున నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా వాల్మీకులు విచ్చేసి తమ సంఫీుభావాన్ని తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ తరపున ప్రతినిధి లక్ష్మి ప్రియ, వైసీపీ పార్టీ నాయకుడు రథయాత్ర రామచంద్ర, జేఏసీ ప్రధాన కార్యదర్శి ముప్పన వెంకటేశ్వర్లు, వాల్మీకి జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యం.జగదీశ్వరరావు, బొప్పవరపు భానుప్రకాష్‌, పిక్కిలి సాయిప్రవీణ్‌, కేతినేని రాకేష్‌ వాల్మీకి, కేగర్ల నరసింహారావు, కేగర్ల నాగరాజు, సత్యసాయి ఉద్యోగ సంఘం నాయకులు జగదీష్‌ పూజారి దివాకర్‌, బడిగే వన్నూరుస్వామి, ఎర్రగొండ రాముడు, వుట్టపు రామకృష్ణ, వన్నూరులో చంద్రస్వామి, బసవ లింగప్ప కృష్ణ, బోయ లింగప్ప, బోయ అనిల్‌, రామాంజనేయులు, కే.రామకృష్ణ, వాల్మీకి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *