-50 మంది భక్తులకు రైలు ప్రయాణ టికెట్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనుకునే పేద భక్తులకు సహాయపడేందుకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (GCT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తిరుమల తిరుపతి యాత్రా సేవ’ పథకం ద్వారా మరో 50 మంది భక్తులకు రైలు ప్రయాణ టికెట్లు పంపిణీ చేయనున్నారు. నవంబర్ 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు ట్రస్ట్ కార్యాలయం వద్ద ఉన్న పన్నీర్ ఫంక్షన్ హాల్లో 8, 9, 10, 11, 12 విడతలకు సంబంధించి ఒక్కో విడతలో 10 మంది చొప్పున మొత్తం 50 మంది భక్తులకు తిరుపతి రైలు ప్రయాణ టికెట్లు అందజేయనున్నారు.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 132 మంది పేద భక్తులకు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దైవదర్శనానికి వెళ్లలేని పేద భక్తులకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గోవిందా హరి గోవిందా.. గోకులనందన గోవిందా’ అనే భక్తి భావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది పేద భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా గొలగాని చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తోంది.
