Breaking News

స్పందనలో అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి..

-స్పందన కార్యక్రమం ద్వారా అధికారులు తక్షణమే స్పందించాలి…
-స్పందనలో 83 అర్జీలు నమోదు…
-కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ప్రజల నుండి స్వీకరించే ఆర్జీలు మరొకసారి రాకుండా పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీ దారులనుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తారన్నారు. అధికారులు ఆర్జీదారుడు ఇచ్చిన వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. వినతులపై సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి మరొకసారి ఆర్జీదారుడు స్పందన కార్యక్రమానికి రానవసరం లేకుండా ఆయాసమస్యలను పరిష్కరించాలన్నారు. సచివాలయం, మండల, డివిజన్‌ స్థాయిలోనే అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
స్పందనలో 83 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 33, పోలీస్‌ 19, గ్రామ వార్డు సచివాలయాలకు 2, విద్య 2, యంఎయుడి 7, వైద్య 2, వ్యవసాయం, డిజెబుల్డ్‌, బిసి వెల్ఫెర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంప్లాయిమెంట్‌ శాఖలకు మూడేసి అర్జీల చొప్పున రాగా, డ్వామా 2, డిఆర్‌ డిఏ 2, సర్వే అండ్‌ సెటిమెంట్‌ 2,ఎక్సైజ్‌ శాఖ 2, రిజిస్ట్రెషన్‌ అండ్‌ స్టాంప్స్‌ 2, వ్యవసాయ, హౌసింగ్‌, డిఅర్‌డిఎ, అర్‌డబ్ల్యుఎస్‌, ఎపిఎస్‌పిడిసిఎల్‌, సాంఫీుక సంక్షేమ, అటవీ శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ నమోదయ్యాయన్నారు. జిల్లాలోని ఆయామండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు మున్సిపల్‌ కమిషనర్లతో వర్చువల్‌గా కొన్ని వినతులను జిల్లా కలెక్టర్‌ అక్కడికక్కడే పరిష్కరించారు.

స్పందనలో నమోదైన ప్రధాన ఆర్జీలు:
జగ్గయ్యపేట మండలానికి చెందిన చెరుకుమల్లి రాధిక ఆర్జీ ఇస్తూ తనకు చెందిన కొంత భూమిని తనకు ప్రక్క సరిహద్దు దారులు అక్రమించి పెన్సింగ్‌ వేశారని, తన భూమిని సర్వే చేసి నిర్థారించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి వర్చువల్‌గా అర్జీదారుని సమక్షంలో సంబంధిత తహాశీల్థార్‌తో మాట్లాడి పరిష్కరించాలని కోరారు.
గంపలగూడెం మండలం తోటమూల గ్రామనికి చెందిన రామిశెట్టి పుష్పావతి అర్జీ ఇస్తూ వినగడప గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమ మట్టి త్వకాలు, ఇటిబట్టీలపై చర్యలు తీసుకోవలన్నారు. తనకు చెందిన వ్యవసాయ పంట భూములకు సమీపంలో నిబంధనలకు విరుద్దంగా ఇటుకబట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయవాడ అర్భన్‌ పెజ్జిన్‌పేటకు చెందిన వాలితేటి పద్మ అర్జీ ఇస్తూ ఇటీవల మరణించిన తన కుమారుడి మరణ దృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని గతంలో నమోదు చేసుకున్న అర్జీపై రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని దీనిపై తగు న్యాయం చేయాలని కోరారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, అసిస్టెంట్‌ డిప్యూటి కలెక్టర్లు ఎస్‌.రామలక్ష్మి, ఖతీఫ్‌ కౌసర్‌ బానో, డ్వామా పీడి జె సునీత, డీఈవో సీివీ రేణుక, ఐసీడీఎస్‌ పీిడి యం.ఉమాదేవి,డియంహెచ్‌వో డా. యం సుహసిని, డీఎస్‌వో పి.కోమలి పద్మ, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, బిసి వెల్ఫెర్‌ ఆఫీసర్‌ సిహెచ్‌ లక్ష్మి దుర్గ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *