Breaking News

కలెక్టరేట్ లో జనవరి 23 సోమవారం స్పందన కార్యక్రమం

-కలెక్టరేట్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఆధార్ నవీకరణ కేంద్రం
-కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 23వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, క్షేత్ర స్థాయి స్పందన కార్యక్రమం యధాతధంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో న జనవరి 23 న జరిగే స్పందన కార్యక్రమం లో అర్జి దారులు తమ స్పందన అర్జీలు అందించ వొచ్చు అని తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి కాకుండా, వారి పరిధిలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో , మండల పరిధిలో అర్జీలు అందచేయాలని తెలిపారు. జగనన్న కి చెబుదాం 1902 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోను చేసి కూడా వారి సమస్యల పరిష్కారం కోసం సంప్రదించ వచ్చునని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉదయం 9 ల నుంచి మ.1 వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదని పేర్కొన్నారు.

కలెక్టరేట్ లో ప్రత్యేక ఆధార్ కేంద్రం:
ఆధార్ కార్డు ను నవీకరణ చేసే ప్రక్రియలో భాగంగా జనవరి 23, 24 రెండు రోజుల పాటు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్పందన కు వచ్చే వారి కోసం, ఉద్యోగస్తుల కోసం ఈ ప్రత్యేక ఆధార్ నవీకరణ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్, ఐరిష్, ఫోన్ నంబర్, చిరునామా తదితర నవీకరణ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందన్నారు. చిరునామా మార్పు కోసం తగిన నిర్ధారిత ధ్రువపత్రాలను (జెరాక్స్) తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *