Breaking News

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించాలి…

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ [UTF] ఎన్టీఆర్ జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  పాల్గొన్నారు. ముందుగా యూ.టి.ఎఫ్. వ్యవస్థాపకులు దాచూరి రామిరెడ్డి – సుబ్బారావు, ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీలు మరియు మృతి చెందిన సభ్యుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించాలని కోరారు, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేయడం లేదని – విద్యావ్యవస్థలో తెస్తున్న మార్పులు ముందుగా కొంత ఇబ్బంది కలిగించిన – భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పారు, అదేవిధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని – ఉపాధ్యాయుల సమస్యలను కూడా ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని యుటిఎఫ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు , పలువురు ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *