Breaking News

కేజీబీవీ సిబ్బందికి జీతాల పెంపు

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 352 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ)లో పని చేస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి 23 శాతం జీతాలు పెంచుతున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదేళ్లుగా కేజీబీవీల్లో బోధన సిబ్బందికి జీతాలు పెంపుదల లేదని, ప్రస్తుతం నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, అందువల్ల జీతాలు పెంచమని ప్రభుత్వం, సమగ్ర శిక్షా దృష్టిలోకి వచ్చిందని తెలిపారు. బోధనా సిబ్బంది ప్రసుతం తీసుకుంటున్న జీతాలకు 23 శాతం అదనంగా పెంచాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కేజీబీవీల్లో ఇంటర్ బోధిస్తున్న పీజీటీలకు కూడా సీఆర్టీలతో సమానంగా చెల్లిస్తామని తెలిపారు. జీతాల పెంపు వల్ల ప్రభుత్వానికి ఆర్ధిక భారం పడుతున్నా కూడా బోధన సిబ్బంది యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని 23 శాతం పెంచడం జరిగిందని తెలిపారు. తద్వారా కేజీబీవీల్లో బోధన నాణ్యత మరింతగా పెరుగుతుందని రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ ఆశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *