Breaking News

మ‌హిళ‌ల సంక్షేమమే..జగనన్న ప్రభుత్వ ల‌క్ష్యం : దేవినేని అవినాష్

-తూర్పు నియోజకవర్గంలో 12,13 డివిజన్ల లబ్ధిదారులతో 3వ విడత “ఆసరా వారోత్సవాలు” రెండు డివిజన్ల పరిధిలో 158 గ్రూపులకు మంజూరైన 88,81,428/- రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
-తూర్పు నియోజకవర్గంలో 20,21,22 డివిజన్ల లబ్ధిదారులతో 3వ విడత “ఆసరా వారోత్సవాలు” రెండు డివిజన్ల పరిధిలో 172 గ్రూపులకు మంజూరైన 69,14,5,611/- రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరువ చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు 12వ డివిజన్ అయ్యప్ప నగర్,నెహ్రు రోడ్ గ్రౌండ్ మరియు కృష్ణలంక APSRM స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన ఆసరా వారోత్సవాలలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ అనునిత్యం శ్రమిస్తున్న జగనన్న ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్న అని అన్నారు.అదే విధంగా మన నియోజకవర్గంలో దాదాపు 32211 మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 31 కోట్ల 44 లక్షల రూపాయలు మీ బ్యాంకు ఖాతల్లో నగదు జమవుతుందని తెలిపారు.ప్రతి మహిళను లక్షాదికరిని చేయడానికి జగనన్న అడుగులు వేస్తున్నారు అని మీకోసం అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన,వై.ఎస్‌.ఆర్ సంపూర్ణ పోషణ,వై.ఎస్‌.ఆర్ చేయూత మొదలైన పథకాలు ప్రవేశపెట్టారన్నారు.గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో, డ్వాక్రా రుణాలు మాఫీ అని మీ అందరికీ గ్రాఫిక్స్ సినిమా చూపించారు,రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు. వైయస్సార్ ఆసరా వారోత్సవాలకు బ్రహ్మరథం పట్టిన అక్క చెల్లెమ్మలు అవినాష్ ధన్యవాదాలు తెలిపారు.ఎవరు ఎన్ని కుట్రలు చేసిన పేదవారి సొంతింటి కలను జగన్ గారు నెరవేరిస్తారని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా పై స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు.గడచిన 12ఏళ్ల కాలంలో ఎన్నో సవాళ్లు అధిగమించి సంపూర్ణ ప్రజా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా దాదాపు 98శాతం పైగా హామీలు అమలు చేసి జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు,బట్రాజు కార్పొరేషన్ ఛైర్మెన్ గీతాంజలి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి,12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్,ఎన్టీఆర్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు  చిమటా సాంబశివరావు వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *