Breaking News

రంజాన్ మాసం భక్తి,పవిత్రత, సేవా సౌభ్రాతృత్వం కి నిదర్శనం… : ఎంపీ కేశినేని నాని


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ భవానిపురం ఈద్గా గ్రౌండ్స్ లో  టీడీపీ నాయకులు ఎం.కే.బేగ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన  భారీ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ముందుగా ముస్లింలందరికి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సమాజంలోని భక్తి భావం, పవిత్రత, సేవా, సౌబ్రాతృతత్వం, సంప్రదాయం, కట్టుబాట్లకి నిదర్శనమన్నారు. ఇదయత్ అంటే ముస్లిం సోదరులు తనతో పాటు పేద వారు ఐనా మరొకరికి సాయం చేయాలని ఇస్లాం చెప్పిన ప్రకారం మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. మొహమ్మద్ షౌది అమెరికాలో సిలికాన్ వ్యాలీ లో వేలాది కంపెనీలను చూసి లాభాపేక్ష లేని ఎన్జీవో ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఇలాగే చాలా మంది ముస్లింలు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు మన అందరికి ఆదర్శమన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడలో రూ.145 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం తథ్యమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మసీదులు, వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కాపాడి చిత్తశుద్దిని నిరూపించుకున్న  ఘనత టీడీపీదే అని అన్నారు. టీడీపీ నాయకులు ఎం.కే.బేగ్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన  ఎంపీ కేశినేని నాని కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన అందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపి వారికి రుణపడివుంటానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ మొహమ్మద్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్, టీడీపీ నాయకులు నల్లపాటి రాము, గన్నే అన్నా ప్రసాద్, గొట్టిపాటి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావు, లింగమనేని శివరాం ప్రసాద్, కోగంటి రామారావు, రేపాల మోహన్ రావు, చేకూరి శ్రీపతి, మోహిద్దీన్, అమానుల్లా, కరిముల్లాహ్, పెందుర్తి శ్రీనివాస్,సారిపల్లి రాధాకృష్ణ, ఏదుపాటి రామయ్య,వాసం మునియ్య, హాబీబ్, ఫిరోజ్, హుస్సేన్, ఏపీ ముస్లిం అడ్వొకేట్ అసోసియేషన్ సభ్యులు మతీన్, ఖలీల్,జమైతే ఉల్మహింద్ సభ్యులు మౌలానా హుస్సేన్, మౌలాలీలు, ఇమాంలు మరియు టీడీపీ నాయకులు మరియు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *