దేవినేని నెహ్రూ ఆశయసాధనకు కృషి:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఎవరికి సాధ్యంకాని విధంగా వరుసగా 5సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఘనత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారిదే అని, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ గారు అని ఆయన తనయుడు, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. సోమవారం దేవినేని నెహ్రూ  6వ వర్థంతి సందర్భంగా తూర్పు నియిజకవర్గంలో అన్ని డివిజన్లలో వైస్సార్సీపీ కార్పొరేటర్లు,ఇంచార్జిలు,దేవినేని అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో అవినాష్ పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన భారీ అన్నదాలు,చలివేంద్రాలు,చీరలు మరియు పలు సామజిక సేవలు ప్రారంభించారు . ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యూనైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థి దశ నుండే పేద విద్యార్థులకు అండగా ఎన్నో పోరాటాలు జరిపిన గొప్ప నాయకుడు నెహ్రూ గారని, రాజకీయ అరంగేట్రం తరువాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బ్రతికిన మానవతవాది నెహ్రూ గారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో ప్రవేశించిన ఎందరికో ఆయన రాజకీయ అవకాశాలు కల్పించి వారి ఎదుగుదల కు తోడ్పడ్డారని అన్నారు. నేడు వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశయసాదనకు కట్టుబడి ఉన్నానని, ఆయన స్పూర్తితో ప్రజసేవలో ముందుకు నడుస్తామని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,దేవినేని అభిమానులు,వివిధ కార్పొషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ సంస్థల నాయకులు,వైస్సార్సీపీ కార్పొరేటర్లు,ఇంఛార్జీలు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నెహ్రూ వర్థంతి వేడుకలు
స్వర్గీయ దేవినేని నెహ్రూ 6వ వర్థంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ గారి చిత్రపటలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాలు, పండ్లు , వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టి ఆయన సేవలను స్మరించుకొన్నారు. మా కుటుంబం మీద అభిమానంతో నాన్న  వర్థంతి సందర్భంగా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *