పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు,కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ సోమవారం అధికారులతో కలిసి కృష్ణలంక జాతీయ రహదారి ప్రక్కన గల అంబేద్కర్ పార్కును క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పార్కులో జరుగుతున్నవంటివి పునరుద్ధరికరణ పనులను మరియు గ్రీనరీ మొక్కలను పరిశీలించినారు. గ్రీనరీ మొక్కలను ఇంకా పెంచాలని సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.అదేవిధంగా ఫ్లోరింగ్ కి వేసిన గ్రానైట్ డిసైన్స్ ను పరిశీలించి వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకొని మిగిలిన పనిని కాంట్రాక్టు వర్కర్లను మరియు యంత్రాలను పెట్టి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా అధికారులకు ఆదేశించడమైనది.ఈ పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …