విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఎన్నో ఆశలతో తెలుగుదేశం ప్రభుత్వనికి అధికారం అప్పజెపితే వారు ప్రజల ఆశలను వమ్ము చేస్తూ సొంత ఆస్తులు పెంచుకొని ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసారని అందుకే ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతూ గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ 19వ సచివాలయ పరిధిలోని పిహెచ్ సి రోడ్డు, బెంజ్ మాన్ కొండ ప్రాంతంలో చివరంచున ఉన్న ఇంటి వరకు నాయకులు, అధికారులతో కలిసి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ జనరంజకంగా పాలన అందిస్తున్నారని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని, కొం డప్రాంతంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అండగా నిలిచారని అన్నారు.గతంలో నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మాత్రమే మా ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అని గత టీడీపీ హయాంలో ఈ కొండ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కొండంచున ఉన్న చివరి ఇంటి వరకు వెళ్లిన అవినాష్ కి నూతన మెట్ల మార్గం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవించగా తక్షణమే స్పందించిన ఆయన మున్సిపల్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వీలైనంత త్వరగా ఆ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ అంబెడ్కర్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ అధ్యక్షులు మట్ట ప్రసాద్ వైస్సార్సీపీ నాయకులు విటల్,లోకేష్ లామ్ కిరణ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …