– ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం నాటికి 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ శతదినోత్సవ కార్యక్రమం కొవ్వూరు పట్టణంలో 18వ వార్డులో వరద గోపాల స్వామి నగర్ లో మేళ తాళాలు, బాణాసంచాలతో ప్రజల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజ శేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేకును కట్ చేసికార్యక్రమాన్ని ప్రారంభించారు. జై జగన్.. జై వనితమ్మ అంటూ నినాదాలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది.ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఏ ఇంటికి, ఏ గడపకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు.కొవ్వూరు నియోజకవర్గంలో మొత్తం 62 సచివాలయాలు ఉండగా.. 50 శాతం ఇళ్లను సందర్చించి ప్రతి ఇంటిలో వారికి కలిగిన లబ్ధిని వివరించడం జరిగిందన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా తమపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ గడపగడపకు కార్యక్రమం 100 రోజులు పూర్తయింది అన్నారు. వెళ్లిన ప్రతి చోటా తమ కుటుంబంలో ఒక ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ పై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలలో మొదటి రోజు నుండి 100వ రోజు వరకు కూడా ఆయా గ్రామాల ప్రజలు హోంమంత్రి తానేటి వనితను పూలాభిషేకాలతో, హారతులిచ్చి ఘన స్వాగతాలు పలికారు. చిన్నారులు, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఎవరెవరికి ఎంతెంత అందుతున్నాయో లబ్ధిదారులకు వివరించారు. ప్రజాప్రతినిధులను, అధికారులను, సచివాలయ సిబ్బందిని అందరినీ గౌరవిస్తూ ప్రజలకు సేవ చేయడం మన బాధ్యత అని, అందరూ చిత్తశుద్దితో పనిచేయాలని సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. కుటుంబంలో ఏఏ పథకాలు అందుతున్నాయి, అందుతున్న సంక్షేమం ఒకవేళ అందకపోతే వాటికి కారణాలను వివరిస్తూ, అర్హులైన వారికి అందించడానికి అవసరమైన తక్షణ చర్యల కోసం అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశిస్తూ గడప గడపకు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.
Tags kovvuru
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …