గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2023-24) సంబందించిన ఆస్తి పన్నును ఏక మొత్తంగా ఏప్రిల్ నెలాఖరులోపు చెల్లించే వారికి మొత్తం పన్ను పై 5 శాతం రాయితీ లభిస్తుందని, పన్ను చెల్లింపుదారులకు వీలుగా శని, ఆదివారం సెలవు రోజులు అయినప్పటికీ క్యాష్ కౌంటర్లు పని చేస్తాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని ఈ నెల 30లోపు ఏక మొత్తంగా ఆస్తి, ఖాలీ స్థల పన్ను చెల్లించి పన్ను రాయితీని వినియోగించుకోవాలని, శని, ఆదివారాలు సెలవు రోజులు అయినప్పటికీ పన్ను రాయితీకి 8 రోజులే గడువు ఉన్నందున క్యాష్ కౌంటర్లు యధావిదిగా పని చేస్తాయని తెలిపారు. కావున ఆస్తి, ఖాళీ స్థలపన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపు సమాచారం కోసం ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పని చేసేలా హెల్ప్ డెస్క్ లను, పన్ను చెల్లింపుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలలో అదనపు క్యాష్ కౌంటర్లను, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లో కూడా క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
Tags gunter
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …