-బాజీబాబా దర్గాలో చాదర్ సమర్పిస్తున్న జమీల్ అహ్మద్ బేగ్
-ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి
-బాజీబాబా దర్గా ఉరుసు ఉత్సవాల్లో
-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా పెదకాకానిలోని బాజీబాబా దర్గాలో గురువారం జరిగిన ఉరుసు మహోత్సవాల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ పాల్గొని బాజీబాబాకు ఛాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, బాజీబాబాగారు అల్లాతో దువా చేయాలని బాజీబాబాను వేడుకొన్నట్లు జమీల్ అహ్మద్ బేగ్ తెలిపారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున దేశ, రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలని మన:పూర్వకంగా కోరుకుంటున్నట్లు నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ తెలిపారు.
Tags gunter
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …