అవ్వతాతలకు వైఎస్సార్‌ కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు పూర్తి చేయండిజిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ద్వారా 60 సంవత్సరాలు నిండిన అవ్వతాతలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ, శస్త్ర చికిత్సలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులు, స్వచ్చంద సంస్థలకు సూచించారు.వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో వైద్యాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా లో 60 సంవత్సరాలు నిండిన అవ్వతాతలు సుమారు 2 లక్షల మందికి పైగా ఉన్నారన్నారు. వీరికి జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు శస్త్రచికిత్సలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు 74,760 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వీరిలో 13,698 మందికి కంటి శస్త్ర చికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు. 23,775 మందికి ఉచితంగా కళ్ళ జోళ్ళు పంపిణీ చేశామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా స్వచ్చంద సంస్థలైన ఊయ్యూరుకి చెందిన రోటరీ కమ్యూనిటి సర్వీస్‌ ట్రస్ట్‌ నందు 2,855, సిబియం ఆసుపత్రి నందు 682, నూజివీడుకు చెందిన గిఫర్డ్‌ ఆసుపత్రి నందు 2,972, గన్నవరంకి చెందిన సిద్దార్థ ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైన్స్‌ నందు 812, తాడిగడపకు చెందిన ఎల్‌ వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రి నందు 2,593, పెదకాకానికి చెందిన శంకర కంటి ఆసుపత్రి నందు 3,784 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా కేవలం 2,770 మందికి సంబంధించిన డేటాను మాత్రమే అప్‌లోడ్‌ చేయడం జరిగిందన్నారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన వారికి సంబంధించిన డేటాను ఆయా ఆసుపత్రులు ఎట్టిపరిస్థితులలో వారం రోజుల లోపు కంటి వెలుగు పోర్టల్‌ లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకుని నివేధిక సమర్పించాలని జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇంకనూ చేయవలసిన 1లక్ష 43 వేల మందికి కంటి వైద్య పరీక్షలను జూలై మాసాంతరం లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎనిమిది టీమ్‌లు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయన్నారు. త్వరితగతిన పరీక్షలను పూర్తి చేసేందుకు గిఫర్డ్‌ కంటి ఆసుపత్రి ఒక టీమ్‌, పిన్నమనేని సిద్దార్థ మెడికల్‌ సైన్స్‌స్‌ ఒక టీమ్‌, శంకర కంటి ఆసుపత్రి రెండు టీమ్‌లను అదనంగా ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాలో అవ్వతాతలు ప్రతి ఒక్కరికి వైఎస్సార్‌ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేసి ఆంధత్వ నివారణలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. యం. సుహాసిని, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ డా. ఏ వెంకట రమణ, స్పెర్టికల్స్‌ డిస్టిబ్యుషన్‌ సెల్‌ అధికారి రఘురామ్‌, కంటి వెలుగు డిఇవో కిరణ్‌జ్వోతి, కంటి ఆసుపత్రుల ప్రతినిధులు రవి, ప్రసంగి, రాజశేఖర్‌, నరేంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *