జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్టోన్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేశామని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమీషనర్‌ సిద్ధార్థ జైన్‌కు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీ సర్వే పనుల ప్రగతిలో భాగంగా జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం, భూ హక్కు పత్రాల పంపిణీ, సర్వేరాళ్ళ నాటేప్రక్రియ, గ్రౌండ్‌ ట్రూతింగ్‌ తదితర అంశాలపై సిసిఎల్‌ఏ కార్యాలయం నుండి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమీషనర్‌ సిద్ధార్థ జైన్‌ గురువారం అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నుండి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 25,834 సర్వే రాళ్ళను పాతే ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొదటి విడతలో ఆరు మండలాలలోని 14 గ్రామాలలో సర్వే రాళ్ళు నాటే ప్రక్రియను పూర్తి చేశామన్నారు. వీటిలో నందిగామ డివిజన్‌లోని జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌ పేట, నందిగామ డివిజన్‌లోని కంచికచర్ల మండలంలో పరిటాల గ్రామం, తిరువూరు డివిజన్‌లో తిరువూరు మండలంలోని చిట్టెల, ఆంజనేయపురం, ముష్టికుంట్ల, వామకుంట్ల, తిరువూరు డివిజన్‌లో గంపలగూడెం మండలంలోని అనుమోలులంక, గంపలగూడెం, కనుమూరు, చెన్నవరం, రాజవరం, వినగడప, తిరువూరు డివిజన్‌లో ఎ.కొండూరు మండలం మారేపల్లి గ్రామాలలో మొదటి విడత సర్వే పూర్తి అయిన గ్రామాలలో సర్వే రాళ్ళు నాటే ప్రక్రియను పూర్తి చేశామన్నారు. భూహక్కు పత్రాల పంపిణీలో భాగంగా జిల్లాలో 11,604 పత్రాల పంపిణీకి గాను నేటి వరకు 10,066 భూ హక్కు పత్రాలను పంపిణీ చేశామని వివిధ కారణాలతో ఇంకనూ పంపిణీ చేయవలసిన వాటిని త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమీషనర్‌ సిద్ధార్థ జైన్‌కు వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి.సంపత్‌ కుమార్‌, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *