-ఊపిరితిత్తులు క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ దూరంగా ఉండండి..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత్తుపద్దార్థాల వలన కలిగే అనార్థాలను వివరించి ఊపిరితిత్తులు క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలను దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జెండా ఊపి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వంటి బయకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కొల్పోయే ప్రమాదం ఉందన్నారు. పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారిలో ఆవయువాలు పాడై ప్రతి రోజు దేశవ్యాప్తంగా సగటున 3,500 మరణాలు సంభవిస్తున్నాయన్నారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరపకూడదనే నిబంధనను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువతీ యువకులు పొగాకు ఉత్పత్తుల వినియోగ వ్యామోహంలో పడకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలని సూచించారు. పిల్లలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు అనుమానం వస్తే వారికి పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పభావాలను అనునయంగా వివరించాలన్నారు. ఇప్పటికే స్వచ్చంద సంస్థల ద్వారా కళాశాలల్లో, ఉన్నత విద్యాసంస్థల్లో పొగాకు దుష్పలితాల అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పొగాకు వినియోగం, ధూమపానం అలవాటు ఉన్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యాధుల బారిన పడతున్నారన్నారు. పొగాకు వలన కలిగే దుష్పలితాలను ప్రజలకు ముఖ్యంగా యువతకు వివరించి అలవాట్లకు దూరంగా ఉంచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పొగాకు ఉత్పత్తుల అలవాటు పడిన వారు మానుకునేందుకు జిల్లా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య, కేంద్రాల్లో కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఇందుకు 18004252024 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. కోట్పాఆక్ట్ జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక ప్రభుత్వం కూడా పొగాకు నిషేద ఉత్పత్తుల అమ్మకాలు జిల్లాలో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులు ధూమపానం సేవించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపాన నిషేధాన్ని కఠిన తరంగా అమలు చేయాలన్నారు. పొగాకు వినియోగం తగ్గించేందుకు నగరపాలక సంస్థ కూడా కొన్ని చర్యలను తీసుకుంటోదన్నారు. ప్రజలు కూడా పొగాకు వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను గురైరిగి అలవాటు ఉన్నవారు క్రమంగా మానేస్తే వారితోపాటు వారి కుటుంబం, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో టోబాకో ఫ్రీ జోన్ గా ప్రకటించినట్లుగానే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వేంచేసియున్న ఇంద్రకీలాద్రిపై కూడా టోబాకో ఫ్రీ జోన్‌గా ప్రకటించడం అభినందనీయమన్నారు.
శాసన మండలి సభ్యులు ఎండి. రుహుల్లా మాట్లాడుతూ పొగాకు వినియోగ దుష్పభావాలపై తరచుగా అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలకు దారితీసి ప్రాణాలు కోల్పొవడం జరుగుతుందని అన్నారు. సిగిరెట్లు, బీడి, పొగాకు వినియోగం వలన వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. అనంతరం పొగాకు ఉత్పత్తుల వినియోగంపై వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్న వారితో కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డియంహెచ్‌వో డా.యం. సుహసిని, ఎన్‌టిసిపి స్టేస్ట్ నోడల్ ఆఫీసర్ జి. శ్రీనివాస్‌రెడ్డి, టోబాకో లీగల్ కన్సల్‌టెంట్ జి. శివ, ఎన్‌సిడిసిడి స్టేట్ కన్సల్‌టెంట్ డా. వి సౌజన్యలక్ష్మి, అడిషనల్ డియంహెచ్‌వో డా.ఉషారాణి, ప్రోగామ్ ఇన్‌చార్జీ డా. వి.మోతిబాబు, డిసియం హరిష్, చైల్డ్ లైన్ జిల్లా కో`ఆర్డినేటర్ ఆరవ రమేష్ ఎఎన్‌యంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.