Breaking News

చెప్పింది చేయడమే సుపరి పాలన

-ప్రజలకిచ్చిన హామీలు అమలు పరిచారా లేదా అనేది సుపరిపాలనకు గుర్తు
-కొన్ని పత్రికలు ప్రజల్లో కృత్రిమ వ్యతిరేకత సృష్టించే పనిలో తలమునకలై వున్నాయి.
-మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
“చెప్పింది చేయడమే సుపరి పాలన” అని, ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఆధ్వర్యంలో “సుపరిపాలన” జరుగుతోందని, రాష్టం అత్యంత ప్రశాంతంగా ఉందని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్  కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. వై.ఎస్.ఆర్ మేధావులఫోరం ఆధ్వర్యంలో తెనాలి పెన్షనర్స్ హోమ్ లో”సుపరిపాలన దిశ గా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశం పై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు అమలు పరిచారా లేదా అనేది సుపరిపాలనకు గుర్తు గా భావించాల్సి వుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 98 శాతం అమలుచేసిన సంగతిని ప్రజలందరూ గుర్తించారని అన్నారు.

ప్రజల కోసం అమలుచేస్తోన్న సంక్షేమం కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు 45 వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. అయితే, సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రం మరో శ్రీలంక గా తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో కూరుకు పోతోందని వాపోతున్న ప్రతి పక్షాలు, ఎన్నికలు సమీపిస్తున్నందున అవే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని పోటీలు పడుతూ ప్రకటనలు చేస్తున్నాయని అన్నారు. అంటే, ఈ ప్రభత్వ విధానాలను ప్రతిపక్షాలు సమర్ధిస్తున్నట్లు భావించాల్సి వుందని, ఇది ఈ ప్రభుత్వ విజయమని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ మినీ మేనిఫెస్టోగా ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలకు లెక్క వేస్తే ఏటా 81వేల 600 కోట్లు ఖర్చు కాగలదని, అల్లాంటి సందర్భం లో ఆ కార్యక్రమాలుఅమలు చేస్తే రాష్ట్రం శ్రీ లంక లా ఆర్ధికంగా సంక్షోభంలో నెట్టివేయ బడదా అని ఆయన ప్రశ్నించారు.

ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో ప్రతిపక్ష పార్టీలుంటే, వాటికి అనుసంధానమైన పత్రికలు ప్రజల్లో కృత్రిమ వ్యతిరేకత సృష్టించే పనిలో తలమునకలై వున్నాయన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా చిన్న చిన్న సమస్యలు వుండడం సహజమని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలైన తెలంగాణా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సైతం ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిని అక్కడి పత్రికలు బైట పెడుతున్నాయన్నారు. అయితే, మన రాష్ట్రంలో మాత్రం పత్రికలు “రాష్ట్రమంతా ప్రమాద భరితంగా వుందని, అభివృద్ధి లేదని” నిజాలను వక్రీకరిస్తున్నాయి అన్నారు. ప్రజల మనస్సుల్లో ప్రభుత్వం పట్ల వున్న ఆదరణను దూరం చేయాలనే దురుద్దేశం తో పనిచేస్తున్నాయన్నారు. ఇందువల్ల ప్రజలకు ప్రభుత్వాన్ని దూరం చేయలేక పోయినా, రాష్ట్రం లో పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నాయని అన్నారు. ఇలాంటి పత్రికలు, వాటి దుష్ప్రచారాలు ప్రజల్లోకి వెళ్ళకుండా అప్రమత్తతతో ప్రజలు వుండాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను తెలుసుకుని ఇటువంటి దుష్ప్రచారాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు వహించాలి అని సూచించారు.

తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి,మాట్లాడుతూ పత్రికలు, ప్రతి పక్షాలు కల్సి నిర్వహిస్తోన్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రాష్టం లోని 5 కోట్ల మంది లో 4కోట్ల మంది “నవరత్నాల” లబ్ది పొందారు అన్నారు. మీడియా పారదర్శకత పాటించడం లేదన్నారు.

సమావేశానికి వై.ఎస్.ఆర్ మేధావులఫోరం అధ్యక్షులు జి. శాంత మూర్తి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం లో డా. కారుమంచి రవికుమార్. డా. ఆర్. జాన్ బాబు,  కోపల్లి జయకర్, బొంతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *