Breaking News

ఏపీ ఫైబర్ నెట్ బాక్సుల సమస్యలను పరిష్కరించగలరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీస్ లకు సంబంధించి సెటప్ బాక్స్ ల కొరకు నాలుగు కంపెనీలతో అనుసంధానం చేయబడింది. ఆయా కంపెనీలు తమ ధరలు 4000 రూ. నుండి 4500 రూ.ల వరకు నిర్ణయించడం జరిగింది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అధిక ధరలతో సెటప్ బాక్స్ లు కొనే పరిస్థితి లో వినియోగదారులు లేరు. కాబట్టి ఇప్పుడున్న ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ లు అన్ని కూడా సెటప్ బాక్స్ లు ఉచితంగా అందిస్తూ వారి సర్వీస్ లు డెవలప్ చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టి లో పెట్టుకుని ఇప్పుడు ఏపీఎస్ఎఫ్ఎల్ కూడా గత ప్రభుత్వం మాదిరి గానే ఉచితంగా సెటప్ బాక్స్ లను అందించాలని ఆపరేటర్ లు మరియు వినియోగదారులు కోరుకుంటున్నారు. ఏ పీ ఎస్ ఎఫ్ ఎల్ కూడా ఈ విధంగా చేయడం వలన సంస్థ యొక్క ఆదాయం పెరగటమే కాకుండా నవరత్నాలు లో భాగంగా ప్రభుత్వ పథకాలను అన్నిటిని కూడా ప్రజలకు వద్దకు నేరుగా తెలియచేయడానికి మరియు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కార్యక్రమం ను కూడా ముందుకు తీసుకు వెళ్లడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ అందిస్తున్న ట్రిపుల్ ప్లే సర్వీస్ ల వల్ల వినియోగదారులకు చాలా తక్కువ ధరలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ మరియు టెలిఫోన్ సౌకర్యం రావడం వలన ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ పట్ల వారు ఎక్కువ మక్కువ చూపించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో సంస్థ సెటప్ బాక్స్లను విక్రయించాలనుకోవడము సబబు కాదు అని ఆపరేటర్ లు మరియు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో లాగానే ఉచితం గా సెటప్ బాక్స్ లను ఆందించిన యెడల ప్రభుత్వం పట్ల ప్రజలకు కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది. గతంలో మన ముఖ్యమంత్రి గారు 50 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఒక సభలో ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ సంస్థ ద్వారా సెటప్ బాక్స్ లను ఉచితంగా అందిస్తే 50 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే కాకుండా దాదాపు 2 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించిన వారు అవుతారు. అంతే కాకుండా ప్రతి రోజు గడప గడపకు ప్రభుత్వ పథకాలను అన్నిటిని కూడా చేరవేసేదానికి మంచి మార్గం గా ఉంటుంది.. కాబట్టి ప్రతి కుటుంబానికి సెటప్ బాక్స్ ఉచితంగా అందించాలని ఆపరేటర్ లు మరియు వినియోగదారులు కోరుకుంటున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *