విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శనివారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ పండరిపురం నందు గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 50వ సచివాలయం పరిధిలోని కరివేపాకు తోట,యలమంచిలి వెంకటప్పయా వీధి ప్రాంతాలలో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి,ఈ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరావుత అవినీతి, లాంచలకు తావులేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోనే నగదు జమ చేయడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.తెలుగుదేశం పార్టీ కి బలముంది అని వారు ప్రచారం చేసుకొనే ఈ 12వ డివిజన్ లోనే దాదాపు 6 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, ఉర్దూ స్కూల్ అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. కరివేపాకు తోట,యలమంచిలి వెంకటప్పయా వీధి రోడ్లు వేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే అని అన్నారు, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు.రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపటినట్టు తెలిపారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక వైస్సార్సీపి ఇంచార్జ్ మాగంటి నవీన్,డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్,వైస్సార్సీపీ నాయకులు సుగుణేశ్వరరావు,ఉస్మాన్,శ్రీను,రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …