-ఆలసత్వం వహిస్తే చర్యలు..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణాలలో క్షేత్ర స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి గృహ నిర్మాణాల పనులు వేగవతం చేయాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ యస్. ఢల్లీిరావు అన్నారు.జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు, జగనన్న సురక్ష, జగనన్న పాలవెల్లువ, జగనన్నకు చెబుదాం, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ బీమా, జిఎస్‌డబ్ల్యుఎస్, నాడు – నేడు పనుల ప్రగతి స్పందన అర్జీల పరిష్కారం పై స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ యస్. ఢల్లీిరావు మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఢల్లీిరావు మాట్లాడుతూ జగనన్న కాలనీ లేఅవుట్లలో గృహ నిర్మాణాల పనులు పూర్తిచేయడంలో శ్రద్ద వహించాలని క్షేత్ర స్థాయి అధికారులతో మండల అధికారులు తరచు సమీక్షించుకోవాలన్నారు. గృహా నిర్మాణాల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేసినప్పుడే పనులు వేగవంతం అవుతాయన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమీషనర్ల నుండి మండలవారి పనుల ప్రగతిపై కలెక్టర్ ఆరా తీశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా సచివాలయల పరిధిలో జరుగుతున్న క్యాంప్‌లను ప్రతీ రోజు పర్యవేక్షించాలన్నారు. స్పందన కార్యక్రమంలో నేటి వరకు 1,279 ఆర్జీలలో 1,052 పరిష్కారం అయ్యాయని మిగిలిన 227 ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఆర్జీలపై గ్రామ మండల స్థాయిలోనే వీలైనంత మేరకు ప్రజల సమస్యలు అక్కడక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా 67 ఆర్జీలు వచ్చాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిర్యాధులపై మండల అధికారులు ఫిర్యాదుదారుడు సంతృప్తి చేందే విధంగా స్పందించాలని కలెక్టర్ ఢల్లీిరావు మండల అధికారులను ఆదేశించారు.టెలికాన్ఫరెన్స్‌లో ఆర్‌డివోలు, జిల్లా మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడివోలు, తహాశీల్థార్‌లు ఉన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …