– పరిపూర్ణమైన ఓటర్ల జాబితాతో పోలింగ్‌ శాతం పెంచండి..

-ఈనెల 21వ తేది నుండి ఆగస్టు 21 వరకు డోర్‌ టుడోర్‌ వెరిఫికేషన్‌..
– వెరిఫికేషన్‌ ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయం వద్దు..
– ప్రతీ 100 మంది జనాభాకు 65 నుండి 70 మంది ఓటర్లు ఉండేలా చూడండి..
-బిఎల్‌ఏలతో బిఎల్‌వోలు సమన్వయం చేసుకోండి..
-టర్నఅవుట్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌తో నూరు శాతం పోలింగ్‌ నమోదు..
– బిఎల్‌వోలకు దశ దిశ నిర్థేశించిన `జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బూత్‌ స్థాయి అధికారులు నిబద్దత, చిత్తశుద్దితో పనిచేస్తే ఎటువంటి తప్పులు లేని పరిపూర్ణమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు.ప్రత్యేక సంక్షిప్త సవరణ `2024లో భాగంగా తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలనపై బూత్‌ స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంతప్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, హాజరై బిఎల్‌వోలకు పలు సూచనలు చేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈనెల 20వ తేది నాటికి బిఎల్‌వోలకు శిక్షణ పూర్తి అవుతుందని, 21వ తేది నుండి ఆగస్టు 21వ తేది వరకు నెల రోజుల పాటు నగరంలోని తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాలలో బిఎల్‌వోలు ఓటర్ల జాబితాపై డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌కు సిద్దం కావాలన్నారు. రోజువారి షెడ్యూల్‌కు సంబంధించిన కాపీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్ల (బిఎల్‌ఏలు)కు అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. బిఎల్‌వోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో రోజుకి 8 నుండి 10 కుటుంబాలను పరిశీలించి, వారంలోని ప్రతీ గురువారం నివేధిక సమర్పించాలన్నారు. జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల పోలింగ్‌ టర్నఅవుట్‌ పరిశీలిస్తే 2014లో 75.91 శాతం నమోదు కాగా, 2019 నాటికి 77.02 శాతం పెరిగిందన్నారు. అర్బన్‌తో పరిశీలిస్తే రూరల్‌ నియోజవర్గాలలో 80 శాతం పోలింగ్‌ నమోదు అవడం గమనార్హం అన్నారు. తూర్పు సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాలలో గత ఎన్నికలలో తక్కువ శాతం పోలింగ్‌ జరిగిందని దీనిని అధిగమించేందుకు పక్కా ఓటర్ల జాబితాను బిఎల్‌వోలు రూపొందించాలన్నారు. భారత ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా టర్నఅవుట్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌ (టిఐపి) తో నూరు శాతం పోలింగ్‌కు చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాలతో పోలిస్తే అర్భన్‌ ప్రాంతాలలో ఇంటింటి సర్వేలో ఎక్కువ సమస్యలు ఉంటాయని బిఎల్‌వోలు దీనిపై క్షుణ్ణంగా పరిశీలించి పనిచేయాలన్నారు. అర్భన్‌ ప్రాంతాలలోని ఒకే డోర్‌ నెంబర్‌తో ఉండే అపార్టమెంట్లలోని ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి డోర్‌, ఫోర్‌, ప్లాట్‌ నెంబర్‌ తప్పని సరిగా నమోదు చేయాలన్నారు. జాబితాలో నమోదు అయి ఉన్న 100 సంవత్సరాలు దాటిన ఓటర్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసమైతే ఫార్మం 8 ద్వారా వయస్సుకు సంబంధించిన సమస్యలు సరిచేసుకోవాలన్నారు. ఎపిక్‌ కార్డులో ఫోటో, పేరు, చిరునామా, స్త్రీ, పురుష వివరాలు సరిచూడాలన్నారు. ఒకే డోర్‌ నెంబర్‌లో 10 నుండి 15 వరకు ఓటర్లు ఉంటే తనిఖీ చేసి పరిశీలించుకోవాలన్నారు. కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్‌ స్టేషన్‌లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిద్ధేశించిన విధంగా వాలంటీర్లను డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌కు ఎట్టి పరిస్థితులోను అనుమతించకూడదన్నారు. 2023 అక్టోబర్‌ 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండే వారిని ఓటర్ల నమోదు తప్పనిసరి అన్నారు. జనాభాకు అనుగుణంగా ఓటర్ల నిష్పత్తి (ఎలక్ట్రోరల్‌ పాపులేషన్‌ రేషియో) ఖచ్చితంగా ఉండాలని, ప్రతీ 100 మంది జనాభాకు 65 నుండి 70 మంది ఓటర్లు ఉండాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు నిర్వహించిన డోర్‌ టు డోర్‌ ఓటర్ల జాబితాను ఐదు శాతం సూపర్‌వైజర్లు, ఒక శాతం ఎఇఆర్‌వోలు, 10 శాతం ఇఆర్‌వోలు క్రాస్‌ చెక్‌ చేయడం జరుగుతుందని, పరిశీలనలో తప్పులను గుర్తిస్తే సంబంధిత బిఎల్‌వోలపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నెల రోజుల పాటు బిఎల్‌వోలు నిర్వహించే డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ ద్వారా 2024 జనవరి 5న రూపొందించే తుది ఓటర్ల జాబితా రానున్న ఎన్నికలకే కాకుండా భవిష్యత్‌ ఎన్నికలలోను ఎటువంటి తప్పులు లేని నిష్పక్ష జాబితాకు దోహదపడుతుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.బూత్‌ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, ఓటు చేర్పు, తొలగింపు, సవరణ, తదితర ప్రక్రియలకు వినియోగించాల్సిన ఫారాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ అవగాహన కల్పించారు. శిక్షణాకార్యక్రమంలో తూర్పు, సెంట్రల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇఆర్‌వోలు అయిన సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ జె. ఉదయబాస్కర్‌రావు, నియోజకవర్గాల ఎఇఆర్‌వోలు, బిఎల్‌వోలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *