‘‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’’ కోసం దరఖాస్తుల ఆహ్వానం

-2023 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం..
-జిల్లా ఎస్సీ సంక్షేమం మరియు సాధికారత అధికారి బి. విజయ భారతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2023లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులకు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం కోసం దరఖాస్తులు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమం మరియు సాధికారత అధికారి బి. విజయ భారతి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ G.O. Ms No. 58 సాంఫీుక సంక్షేమ శాఖ తేది 12.10.2023 ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్‌ లోని సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన/వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. యుపిఎస్‌సి నిర్వహించే ప్రిలిమ్స్‌ అండ్‌ మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి రూ.1,00,000/- నగదు ప్రోత్సాహకం మరియు మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి రూ.50,000/- నగదు ప్రోత్సాహకం అందిస్తారని జిల్లా ఎస్సీ సంక్షేమం మరియు సాధికారత అధికారి విజయ భారతి ఆ ప్రకటన లో తెలిపారు. అభ్యర్థులు jnanabhumi.ap.gov.in పోర్టల్‌లో అందించిన వెబ్‌ లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తును నమోదు చేసి నింపాలి. పోర్టల్‌లో దరఖాస్తులను నమోదు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్‌ 4, 2023.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *