Breaking News

విశాఖ సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా గణిత శాస్త్ర వేడుకలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ గణితశాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శుక్రవారం విశాఖపట్నంలోని గాజువాకలో సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా జాతీయ గణిత శాస్త్ర వేడుకలు జరిగాయి దాదాపు 350 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను రూపొందించి తల్లితండ్రులకు వివరించారు బెంగళూరులోని ప్రధాన కార్యాలయం నుంచి ఆన్లైన్లో వివిధ పోటీలు నిర్వహించారు సంస్థ చైర్మన్ వాస శ్రీనివాస్ డైరెక్టర్ వాస మాధవి ప్రిన్సిపల్ జి భారతి వైస్ ప్రిన్సిపల్ ఆర్ఎస్ శెట్టిల నేతృత్వంలో కోఆర్డినేటర్ దివ్య ఎం శ్రీనివాసరావు ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. బీహెచ్ఈఎల్ సంస్థ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *