విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పశ్చిమ నియోజకవర్గం కార్యలయం యువగళం విజయోత్సవం పై విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ నాని ఆదేశాల మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎం.ఎస్.బేగ్ మాట్లాడుతూ ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను చుస్తే జగన్ కి మతిభ్రమించిందన్నారు. హాజరైన జన సందోహాన్ని చూసి వైకాపా నేతల్లో ఓటమి భయం అనేది స్పష్టంగా కనబడుతుందన్నారు. అది యువగళం ముగింపు సభ కాదని, నవ శాఖానికి పిలుపునిచ్చిన ప్రారంభ సభ అని అన్నారు. సభ విజయవంతం అవ్వడం తో ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టి ఏం చేయాలో తెలియక అభ్యర్థుల మార్పు అంటూ ఒక ప్రచారాన్ని ప్రారంభించాడన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని గ్లోబల్ ప్రచారాలు చేసిన ఎంతమందిని మార్చిన రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు 160 అసెంబ్లీ 24 ఎంపీ స్థానంలో టిడిపి జనసేన అభ్యర్థులకు అందించబోతున్నారని ఆశ సభ జరిగిన తీరు చూస్తే కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో బై బై జగన్ అంటున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు అసలు సీఎం అభ్యర్థిని మర్చాలానే నిర్ణయానికి ఆంధ్ర ప్రజలు వచ్చేశారన్నారు. యువగలం ముగింపు బహిరంగ సభను భారీగా విజయవంతం చేసిన టిడిపి జనసేన నేతలకు ధన్యవాదాలు తెలిపారు. టీమ్ టిడిపి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చిన టిడిపి నేతలకు, టీమ్ టిడిపి కుటుంబం సభ్యుల కు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. అశేష జనవాహిని లో తనకు మాట్లాడే అవకాశం కల్పించిన, మైనార్టీల సమస్యలపై గళం విప్పేలా చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు కి , జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ నాని కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశం జిల్లా కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధా కృష్ణ,కుప్పుల గంగాధర్ రెడ్డి, షేక్ హబీబ్, ఎదుపాటి రామయ్య, జిల్లా అధిక ప్రతినిధు బెవర సాయి. సుధాకర్, రాష్ట్ర బిసి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బూర కనకరావు, దూది బ్రాహ్మయ్య, టీమ్. టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News