-గ్రామస్థులతో కలిసి జగజ్జివన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొడాలి నాని
-జగ్జీవన్ రామ్… అంబేద్కర్ లాంటి మహానీయుల స్ఫూర్తితో సీఎం జగన్ పాలన సాగుతుంది – ఎంపీ సురేష్
– అంబేద్కర్ కు సమకాలికుడిగా…అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎనలేని సంస్కరణలు చేసిన మహనీయుడు జగజ్జీవన్ రామ్ – ఎమ్మెల్యే కొడాలి నాని
-కులతత్వ.. మతతత్వ… ధనిక పార్టీలు…. పెత్తందారుల కూటమికు ప్రజలు బుద్ధి చెప్పాలి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ రూరల్ మండలం చిరిచింతల గ్రామంలో స్వర్గీయ భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామస్తులతో కలిసి జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.తొలుత చిరిచింతల గ్రామ సెంటర్లో ఎంపీ సురేష్, ఎమ్మెల్యే కొడాలి నానిలకు గ్రామ పొలిమేరలో, చిరిచింతల గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సిపి నాయకులు, పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీగా ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే నాని గ్రామంలో పర్యటించారు. ఇరువురు నాయకులకు వీధి వీధిన మహిళా సోదరీమణులు మంగళ హారతులతో స్వాగతం పలుకగా, గ్రామస్తులు పూల మాలలు వేస్తూ తమ ఆత్మీయతను చాటుకున్నారు. ముందుగా ఎంపీ సురేష్ వైసీపీ జెండా ఆవిష్కరించి,విగ్రహ ప్రారంభోత్సవ రిబ్బన్ కట్ చేయగా, ఎమ్మెల్యే కొడాలి నాని శిలాఫలకాని ఆవిష్కరించారు. ఇరువురు నాయకులు కలిసి స్వర్గీయ జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విగ్రహాల ఏర్పాటుకే పరిమితం అయ్యేవని…. కానీ సీఎం జగన్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలే లాంటి మహానుయుల స్ఫూర్తితో పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు కోటీశ్వరులు, పెత్తందారుల ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తాడే తప్ప, బలహీన వర్గాలతో పనిలేదన్నారు. కింద స్థాయి జాతులను చంద్రబాబు ఎనాడు ఆదరించలేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలపై కేసులు పెట్టి వేధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఎంపీ సురేష్ గుర్తు చేశారు. నేడు అవకాశాలు అన్నీ చేయిజారిన తర్వాత మళ్లీ ఎలాగైనా, బడుగు బలహీన వర్గాలను చేజికించుకోవాలనే లక్ష్యంతో సభలు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నాడని ఆయన మండిపడ్డారు.
సామాన్యులకు, బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ నాయకత్వానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని ఎంపీ సురేష్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ దేశానికి గొప్ప సేవలు అందించిన మహానీయుడు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటుచేసిన గ్రామ పెద్దలు అభినందనీయులని, వేడుకల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని పూర్తిస్థాయిలో అందించడమే కాకుండా, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తు అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ లాంటి జాతి నేతల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే నాని అన్నారు. నా ఎస్టీలు… నా బీసీలు…. నా మైనార్టీలు…. నా ఆగ్రవర్ణ పేదలు అంటూ వారికోసం కష్టపడుతున్న సీఎం జగన్ ను ఒంటరిని చేస్తూ, ఏకమైన మతతత్వ… కులతత్వ…. ధనిక పార్టీలు…. పెత్తందారుల కూటమిని ప్రజలందరూ ఏకమై ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్యే టికెట్లను చంద్రబాబు అమ్ముకుంటుంటే, సురేష్ లాంటి నిరుపేదలు, చిన్న కుటుంబాల్లో పుట్టిన వారికి టికెట్లు ఇస్తూ సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడ్డారని ఎమ్మెల్యే నాని అన్నారు. కోట్లాది రూపాయలకు టికెట్లు కొనుక్కొని డబ్బు సంచులతో వస్తున్న ఎన్నారైలను ప్రజలు తరిమికొట్టాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. విగ్రహావిష్కరణ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ మట్ట నాగమణి జాన్ విక్టర్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, ఎంపీటీసీ సింగవరపు ఝాన్సీ రాణి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చందనపల్లి సుందర్రావు, సర్పంచ్ తోట వీరరామయ్య (రాంబాబు), సర్పంచ్ పటాన్ గౌస్ల , జిల్లా సమైక్య ఉపాధ్యక్షురాలు తోట మునిమ్మ, వైసిపి నాయకులు కారే జోసఫ్, గద్దె రామాంజనేయులు (రాము), సింగవరపు సుబ్బారావు, ఏలేటి ఆంజనేయులు, జిల్లా స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు కళ్లేపల్లి పవన్, రామనపూడి సర్పంచ్ మీగడ మురళీధర్, శీపూడి సర్పంచ్ కలతోటి థామస్ , బొప్పన రాజబాబు, మెండ కిరణ్, నందివాడ ఎంపీపీ పేయ్యల ఆదాం, నందివాడ మండల వ్యవసాయ సలహా కమిటీ కన్వీనర్ కొండపల్లి కుమార్ రెడ్డి, గుడివాడ టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ బాజీ, గుదే రవి, గంట సురేష్, డాక్టర్ ఆర్కే, ఆలపాటి హరిబాబు, చుండూరు శేఖర్, వెంపటి సైమన్, కలపాల కిరణ్, గిరి బాబాయ్, పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News