Breaking News

నేను పాలకుడును కాదు సేవకుడుని సేవ చేసేందుకు ఏ రకమైన హద్దులు లేవు..

-నగర పాలక సంస్థ 16 సచివాలయల పరిధిలగల 2284 మంది లబ్ధిదారులు  రు.4.28 కోట్లు వై ఎస్ ఆర్ చేయూత క్రింద వారి బ్యాంకు ఖాతాలకు జమచేసాం.
-నియోజకవర్గ అభివృద్ధికి సేవే చేయడమే నా లక్ష్యం
-మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి వైయస్సార్ చేయూతగా రు.75 వేల రూపాయలను ఆర్ధిక సాయం అందించడంతో పాటు వారికి జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ భరోసా కల్పించారని జిల్లా ఇన్చార్జి మంత్రి  రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ  శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి రూరల్. నియోజవర్గం అర్బన్ ప్రాంతానికి సంబంధించి 4వ విడత వైయస్సార్ చేయూత కార్యక్రమం స్థానిక ఇన్నిస్ పేట బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి   మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజవర్గానికి సంబంధించి నగర పాలక సంస్థ లోని 16 సచివాలయల పరిధిలగల 2284 మంది లబ్ధిదారులు రు.428.25 లక్షలరూపాయలను వై ఎస్ ఆర్ చేయూత క్రింద వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. పేదవానికి జబ్బు చేస్తే వారి ఆర్థిక స్థితిగతులు వెనుకబడి ఆర్థికంగా బలోపేతం చెందలేదని గుర్తించిన నాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదవాని ఆరోగ్య ఆర్థిక భద్రతలకు భరోసానందించాలన్నారు. నాడు 2.5 లక్షల ఖరీదైన ఆరోగ్యశ్రీ ద్వారా పేదవానికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తే నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి రు. 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచారన్నారు. ఇదే కాకుండా ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇంటింటికి వైద్య సేవలు 108, 104 వాహనాలు ద్వారా వైద్య సౌకర్యాన్ని అందిస్తున్నారన్నారు.

45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కచెల్లెళ్లకు ప్రతి ఏటా “వైఎస్సార్ చేయూత” క్రింద రూ.18,750 చొప్పున క్రమం తప్పకుండా సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 4 వ విడతగా “వైఎస్సార్ చేయూత” క్రింద  రూ. 5,060.49 కోట్ల రూపాయలు అందించి అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అర్హులైన అక్క చెల్లెలు చేయూతగా ఆర్థిక సహాయాన్ని అందించి వారికి ఆసరాగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. మరోవైపు విద్యకు అత్యంత ప్రాధాన్యాలు తెలుస్తూ పేద విద్యార్థి పాఠశాలల్లో చేరిన నాటినుండి ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, జగనన్న వసతి దీవెన విద్యా దీవెన, విదేశీ విద్య పాఠశాలల ఆధునీకరణ మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యాభివృద్ధికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. వివిధ రకాల పెన్షన్ల కింద గత ప్రభుత్వంలో నెలకు రు. 400 కోట్లు ఇస్తే నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలు వివిధ రకాల పెన్షన్ రూపంలో లబ్ధిదారుల పాతాల్లో జమ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేస్తానని అది నెరవేర్చకుండా మోసగిస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నాలుగు విడతల్లో అక్క చెల్లెమ్మలైన డాక్రా మహిళల రుణాన్ని మాఫీ చేసి ఆసరాగా నిలిచారన్నారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గత పాలకుడు నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించలేదని పరిసరాల పరిశుభ్రతను కూడా పట్టించుకోకపోగా.. నేడు గ్రామాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నేను పాలకుడును కాదు సేవకుడునిమాత్రమే.. సేవ చేసేందుకు ఏ రకమైన హద్దులు లేవని నియోజకవర్గ అభివృద్ధికి సేవే చేయడమే నా లక్ష్యం అని ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరుకుంటూ మీ సేవకుడిగా ఉంటానన్నారు. ముఖ్యమంత్రి ఏ ఆశయంతో ఈ నియోజకవర్గానికి నన్ను పంపించారో ఆ ఆశయాన్ని నెరవేస్తానని అందుకు నియోజకవర్గ ప్రజల సహకరించాలని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా 24/7 మీకు అందుబాటులో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పి. ఎం.సత్యవేణి, ఎంహెచ్ఓ వి. వినూత్న, స్థానిక నాయకులు కొప్పినీడి ప్రసాద్ బాబు (రాజమౌళి) అంగాడి సత్యప్రియ, దుంపా చంద్రారెడ్డి, పడమటి కామరాజు, పడమటి నాగమణి, బిల్డర్ చిన్న నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *