Breaking News

పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

-మత్స్యకార కుటుంబాల ముఖాలలో చిరునవ్వు లక్ష్యంగా పులికాట్ ముఖ ద్వారం పూడిక తీత: ఎంపీ గురుమూర్తి
-ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి: ఎంఎల్సి మేరుగ మురళి

నవాబ్ పేట, గూడూరు డివిజన్, తిరుపతి జిల్లా,  నేటి పత్రిక ప్రజావార్త :
పులికాట్ ముఖద్వారం పూడికతీత కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల మార్చి 12 న ముఖ్యమంత్రి  చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిక తీత పనులకు శంఖు స్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ గారు ఎంపీ ఎం. గురుమూర్తి, ఎంఎల్సి మేరుగ మురళి లతో కలిసి పులికాట్ సరస్సు నందు బోట్ లో ప్రయాణించి పులికాట్ ముఖద్వారం పూడిక తీత ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడుతూ ఈ పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు ఏర్పడతాయని, నవాబ్ పేట, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

శనివారం మధ్యాహ్నం నవాబ్ పేట సమీపంలోని పులికాట్ సరస్సులో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిక తీత కార్యక్రమానికి శంఖు స్థాపన చేయనున్న ప్రాంతాన్ని గౌ. జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎంఎల్సి సంబంధిత అధికారులతో కలిసి పులికాట్ సరస్సు నందు బోట్ లో ప్రయాణించి అక్కడ వాస్తవిక పరిస్థితులను పరిశీలించి పలు విషయాలు తెలుసుకుని వచ్చి నవాబ్ పేట నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని నవాబ్ పేట, పూడి రాయదరువు, దుగిరాజ పట్నం, మిడుగుర్తి తదితర గ్రామ ప్రజలతో వారి సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవాబ్ పేట, దాని పరిసరాల్లో పులికాట్ అంశం నా దృష్టికి ఎంపీ తెచ్చినప్పుడు నేను తప్పక చూడలనుకున్నాను అని, మౌలిక వసతులు సరిగా లేకుండా ఉండడం ఇప్పుడు కళ్ళారా చూసాక బాధ అనిపిస్తోందని, రహదారి అంశంపై అటవీ అధికారులతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేస్తామని, మనసుంటే మార్గం ఉంటుందనీ, సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలిపారు. ఒక వైపు శ్రీహరికోట ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉందని, ఈ నవాబ్ పేట ప్రాంతం కూడా పులికాట్ సరస్సు లో పూడిక తీత ద్వారా సముద్రం నుండి చేపలు సరస్సులోనికి రావడానికి మార్గం సుగమం అవుతుంది అని, తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని, అలాగే రక రకాల పక్షులు వస్తాయని, సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని అన్నారు. ఈ పూడిక తీత కార్యక్రమం సుమారు రూ. 97.09 కోట్లు కేటాయింపుతో మేలు చేకూరనున్నదని తెలిపారు. ఈ గ్రామంలో 5వ తరగతి వరకు మాత్రమే ఉందని, పిలల్లను తల్లిదండ్రులు తప్పక పంపాలని సూచించారు. సబ్ స్టేషన్ కొరకు గ్రామస్థులు కోరగా రెండు రోజుల్లో సబ్ స్టేషన్ కు స్థలం ఆర్డీఓ గూడూరు ద్వారా అందజేయడం జరుగుతుందని, తదుపరి చర్యలు చేపడతామని, జిల్లా యంత్రాంగం నుండి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

ఎంపీ మాట్లాడుతూ తాను ఎంపీ గా తొలి సారి గ్రామానికి వచ్చినప్పుడు పులికాట్ ముఖ ద్వారం పూడిక సమస్య, సెల్ టవర్ గురించి అడిగారని వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్లు విన్నవించి పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిక తీతకు ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి చొరవ ద్వారా అనుమతులు మంజూరు తేగలిగామని ఈనెల మార్చి 12 న ముఖ్యమంత్రి వర్చువల్ గా శంఖు స్థాపన చేయనున్నారని తెలిపారు. మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వు లక్ష్యంగా ఈ కార్యక్రమానికి అడుగులు వేశామని తెలిపారు. మనపాలెం నుండి నవాబ్ పేట రోడ్ రూ. 3.97 కోట్లతో మంజూరైంది అని తెలిపారు. సెల్ టవర్ పూడి రాయదరువు వద్ద ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని, గౌ. ప్రధానమంత్రి గారు తొందర్లోనే పలు సెల్ టవర్లకు శంఖు స్థాపన చేయనున్నారని తెలిపారు. చేపలు, రొయ్యల వ్యాపారం అభివృద్ధి అవుతుందని అన్నారు. భారత ప్రభుత్వం నుండి ఈ ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు.

ఎంఎల్సి మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రైస్ అందనటువంటి 6000 కార్డులకు బియ్యం అందేలా మన కలెక్టర్ సహృదయులు చర్యలు తీసుకున్నారని, గూడూరు ఆర్డీఓ తదనుగుణంగా పంపిణీ చేపట్టారని తెలిపారు.ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటోందని తెలిపారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ మనపాలేం నుండి చినతోట వరకు బిటి రోడ్ రివిట్మెంట్ కొరకు కోరారు. కలెక్టర్ వారి సమస్యలు సావధానంగా విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు కిరణ్ కుమార్, చంద్ర ముని, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజు, ఎస్ ఈ లు శంకర్ నారాయణ, విజయ కుమార్ తదితర జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *