Breaking News

బురదగాలి కొత్తపాలెం డా. వై.ఎస్.ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
బురదగాలి కొత్తపాలెం డా. వై.ఎస్.ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ, ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎంఎల్సి మేరుగ మురళి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిందని, నేటి శనివారం ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సుమారు రూ.17.50 లక్షల అంచనా విలువతో నిర్మితమైన విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్, సూళ్లూరుపేట చంద్రముని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *