
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి విజయవాడ నందు శనివారం ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నకు, సయ్యద్ లాల్ సాహెబ్ సభ అధ్యక్షత వహించక, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి. రాజకుమారి, డి . ఐ. జి. ఎ . పి . ఎస్ . పి, మాట్లాడుతూ… ప్రతి మహిళ దిశ చట్టం, గృహహింస నిరోధక చట్టం, ఫోక్సో చట్టం, నిర్భయ చట్టం, పై అవగాహన కల్పించారు, ప్రతి మహిళ కుటుంబంలో సమాజంలోనూ సమర్థవంతంగా తన బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్” బి.కీర్తి మాట్లాడుతూ… మహిళలకు చట్ట సభలలో 35% ముప్పది ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని, అదేవిధంగా మహిళలు రాజకీయపరంగా చైతన్యవంతంమై చట్ట సభలకు వెళ్లాలని సూచించారు. డా ” రష్మి మాట్లాడుతూ… వాసవ్య మహిళా మండలి ద్వారా నిర్భాగ్యులైన ఎందరో మహిళలకు అనేక సేవా కార్యక్రమాలు, పోలీస్ మిత్ర ద్వారా మహిళా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. డా” సయ్యద్ లాల్ సాహెబ్ మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సుకు మహిళా హక్కుల కొరకు కృషి చేస్తున్న మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అంతేకాక పురుషులకు మహిళ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన నాడు మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అఘాయిత్యాలు అదుపుదలవుతాయని అన్నారు. డా” మనవల ఆంజనేయులు మాట్లాడుతూ అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో” లాల్ మాస్టారు, మణికుమార్, ఎంకోజీ , ఈ యొక్క టీం ఆధ్వర్యంలో మహిళ చట్టాలపై అవగాహన కార్యక్రమం, సమాజ సేవ చేస్తున్న మహిళ స్త్రీమూర్తులకు సత్కారం, అవార్డ్స్, సర్టిఫికెట్స్, మెమొంటోస్ అందించి మహిళా మూర్తులను, సామాజిక కార్యకర్తలను, ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ముఖ్యఅతిథి, బి. రాజకుమారి. ఐ. పి.యస్., డా” కీర్తి ల చేతుల మీదుగా ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ లోగో, సర్టిఫికెట్, ఆవిష్కరించడం జరిగినది. తరువాత రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న, 70 డెబ్బది మంది మహిళలకు, 30 ముప్పై మంది పురుషులకు ఉత్తమ సేవా రత్న అవార్డ్స్, సర్టిఫికెట్స్, శాలువా, బోకెలతో చిరు సత్కారంతో” ప్రోత్సహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి సభ్యులు, ప్రభుత్వ ఆయా శాఖలలో సేవలు అందిస్తున్న మహిళా మూర్తులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సింహాద్రి మాధురి కృష్ణ, గ్రంధాలయ శాఖ వేముల విజయ్ కృష్ణ, ఈ.టి.ఎం.ఐ. కాట్రు ప్రశాంతి, దొండపాటి అనిత, సయ్యద్ మున్నీర్ బేగం, కడియం లావణ్య, అయ్యంకి లక్ష్మి, మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ సభ్యులు, పలు సామాజిక సంఘాల ముఖ్య నేతలు, ఉమ్మడి అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి కృష్ణ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, సంఘల నేతలు ఆర్గనైజేషన్ సభ్యులు, దాడి రవీంద్ర కుమార్, కొక్కెరమెట్ల నరసింహారాజు, కోడి కిషోర్, కుందేటి వెంకటరమణ, కొమ్మన నాగసూరన్న, కోటేశ్వరరావు, శ్రీవాణి, శాంతి, ప్రభుదాస్, పలువురు వక్తలు, సామాజిక కార్యకర్తలు, మహిళా మూర్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News